కబీర్ సింగ్ మీద ఎందుకంత ఈర్ష్య ?

Sat Jun 22 2019 11:51:41 GMT+0530 (IST)

ఈ ప్రశ్న నిన్న కబీర్ సింగ్ గురించి బాలీవుడ్ క్రిటిక్స్ కొందరు రాసిన రివ్యూలు చదివాక సౌత్ ఆడియన్స్ ప్రతి ఒక్కరిలోనూ మెదిలింది. కారణం ఈర్ష్యతో సౌత్ దర్శకులు ఇలాంటి యునీక్ కంటెంట్ తో మెప్పిస్తున్న తీరుని ఓర్వలేనితనం వెరసి ఇప్పుడు ఇదో రచ్చగా మారే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఓ డ్రగ్ ఎడిక్ట్ లవ్ స్టోరీగా అమ్మయి పొందు కోసం ఏదైనా చేసే సైకో డాక్టర్ ప్రేమ కథగా సదరు క్రిటిక్స్ దీన్ని వర్ణించిన తీరు మీద రీడర్స్ నుంచి సైతం నిరసన వ్యక్తం అవుతుండటం గమనార్హం.గతంలో ఎన్నో చెత్త సినిమాలను కంటెంట్ పరంగా ఏ మాత్రం మెప్పించలేని స్థాయిలో ఉన్న మూవీస్ ని పొగిడిన నోళ్ళు ఇప్పుడు ఇలా చేయడం చూస్తే ముమ్మాటికి సౌత్ సినిమా స్టాండర్డ్ ని ఓర్వలేనితనమే. రెండు వారాల క్రితం వచ్చిన సల్మాన్ ఖాన్ భారత్ లో ఎన్ని లోపాలు ఉన్నా కథనం ఎంత నీరసంగా ఉన్నా ఆహో ఓహో అంటూ నాలుగు పైగా రేటింగ్స్ తో ఆకాశానికెత్తిన కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడీ కబీర్ సింగ్ ని టార్గెట్ చేయడం చూస్తే ఉద్దేశం ఏమిటో స్పష్టంగా కనిపిస్తోంది .

జనరల్ ఆడియన్స్ నుంచి వస్తున్న పబ్లిక్ టాక్ మాత్రం చాలా పాజిటివ్ గా రావడం చూసి టీం రిలాక్స్ అవుతోంది. యుట్యూబ్ లో వీటి తాలుకు వీడియోలనే సాక్ష్యంగా చూపిస్తున్నారు. రెండో సినిమానే అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ లో ఇది ఫస్ట్ మూవీ. షాహిద్ కపూర్ లాంటి మీడియం రేంజ్ హీరోతో ఇంత హైప్ డెబ్యుతోనే తెచ్చుకున్నందుకు ఇలా టార్గెట్ చేశారు కాబోలు అని సోషల్ మీడియాలో సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు