Begin typing your search above and press return to search.

స్వీటీ మిస్సింగ్ ..! అస‌లేమైంది ఎందుకీ `నిశ్శ‌బ్ధం`?

By:  Tupaki Desk   |   29 Sep 2020 11:10 AM GMT
స్వీటీ మిస్సింగ్ ..! అస‌లేమైంది ఎందుకీ `నిశ్శ‌బ్ధం`?
X
మాయ‌దారి మ‌హ‌మ్మారీ ఎవ‌రిని అయినా మార్చేస్తుంది. టాలీవుడ్ లో స్వీటెస్ట్ డార్లింగ్ గా పేరున్న స్వీటీ అనుష్క మ‌న‌సును కూడా క‌రోనా భ‌యం మ‌ర్చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2 న `నిశ్వ‌బ్ధం` రిలీజ‌వుతున్నా ఇంత‌వ‌ర‌కూ ప్రమోషన్ కు అనుష్క శెట్టి ముందుకు రావడం లేదట‌.

మిగిలిన‌ది కేవ‌లం రెండ్రోజులే అయినా ఇంకా ఎందుకీ బెట్టు? ఎందుకని ఇంట‌ర్వ్యూలు స‌హా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు రావ‌డం లేదు? అంటూ ఒక‌టే డిస్క‌ష‌న్ సాగుతోంది. అయితే డైరెక్ట్ గా మీడియా ఇంట‌రాక్ష‌న్స్ కంటే బైట్స్ ఇవ్వ‌డం ద్వారా స‌రిపెట్టాల‌నుకుంటోంద‌ట‌. అయితే ఇది చిత్ర‌బృందానికి కొంత ఇబ్బందిక‌ర‌మే అయినా.. స్వీటీతో సాధ్య‌మైనంత ప్ర‌మోష‌న్ చేయించుకునే స్ట్రాట‌జీ వాళ్ల‌కు ఉండాల్సింది అంటూ పంచ్ లు వేస్తున్నారు.

ఒకేసారి పలు భాషల్లో అమెజాన్ ప్రైమ్ ‌లో ప్రదర్శిస్తున్న సినిమాగా `నిశ్శ‌బ్ధం` మూవీ గురించి చెబుతున్నారు. అయితే ప్ర‌చారం ప‌రంగా వీక్ అవ్వ‌డంతో ఇది జ‌నంలోకి ఏమేర‌కు వెళుతుంది? అన్న‌ది చూడాలి. `వి` ప్ర‌మోష‌న్స్ తో పోలిస్తే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ వీక్ అన్న మాట అయితే వినిపిస్తోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.