Begin typing your search above and press return to search.

ఆర్.ఆర్.ఆర్ మూవీతో ఎవరి మార్కెట్ పెరగబోతోంది..?

By:  Tupaki Desk   |   2 April 2020 8:30 PM GMT
ఆర్.ఆర్.ఆర్ మూవీతో ఎవరి మార్కెట్ పెరగబోతోంది..?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ 'రౌద్రం రణం రుధిరం'.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అత్యంత భారీగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో తారాగణం కూడా అంతే భారీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్‌ను ఎన్టీఆర్‌కు జతగా తీసుకున్నారు. ఈ సినిమాలో 'అల్లూరి సీతారామరాజు' గా రామ్ చరణ్, 'కొమరం భీమ్‌' గా ఎన్టీఆర్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని రాజమౌళి తీస్తున్న చిత్రం కావడం, ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటం తో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ లు మిగతా కమిట్మెంట్స్ పక్కన పెట్టి రెండేళ్ల డేట్స్ రాజమౌళికి ఇచ్చారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఏ డిబేట్ లో అయినా అందరికి ఎదురవుతున్న మొదటి ప్రశ్న 'ఈ చిత్రం ద్వారా ఈ ఇద్దరి హీరోల్లో ఎవరి మార్కెట్ పెరగబోతోంది? అని. ఎన్టీఆర్ అభిమానులు మా హీరో మార్కెట్ పెరుగుద్ది అంటే, రామ్ చరణ్ అభిమానులు మా హీరో మార్కెట్ పెరుగుద్ది అంటూ పోటా పోటీ కామెంట్స్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి ఫ్యాన్స్ ప్రభాస్ ని మించి మార్కెట్ పెరుగుద్దని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభాస్ కి ఈ మార్కెట్ 'బాహుబలి' లాంటి పాన్ ఇండియా సినిమాతో వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ ఒక్కటే దీనికి హెల్ప్ అవలేదు. బాహుబలి ఒక కల్ట్ సినిమా కావడం తో అది హిందీ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుని మరో పదేళ్లు ఎవరూ టచ్ చేయని రికార్డ్స్ సృష్టించడం వల్ల కూడా వచ్చింది. కానీ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా 'సాహో'తో తన మార్కెట్ కాపాడుకున్నాడనే చెప్పొచ్చు. ఈ సినిమా మన టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో ఎక్కువ కలెక్ట్ చేసింది. ఒకవేళ రాజమౌళి ఈ సినిమాతో హిట్ కొడితే హీరోల కంటే ఈయన మార్కెట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏదేమైనా ఫ్యాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి సినిమా విడుదలయ్యాక తమ అభిమాన హీరోల సినిమా చూసి ఎంజాయ్ చేయాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.