Begin typing your search above and press return to search.

ఆ మూడవ హీరో అసలు దొరికేనా?

By:  Tupaki Desk   |   26 Feb 2020 3:30 PM GMT
ఆ మూడవ హీరో అసలు దొరికేనా?
X
గత ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్‌ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్‌ రావిపూడి ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో వచ్చిన విషయం తెల్సిందే. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కి ఎఫ్‌ 3 తో రావాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వస్తున్న నేపథ్యంలో వచ్చేది అనుమానమే అంటున్నారు. జక్కన్న సినిమా కారణమో లేక మూడవ హీరో కారణంగానో వచ్చే సంక్రాంతి కి అనీల్‌ రావిపూడి మూవీ ఉండక పోవచ్చు అంటున్నారు.

ఎఫ్‌ 2 చిత్రం లో ఇద్దరు హీరోలు నటించారు. ఇక ఎఫ్‌ 3 చిత్రంలో ముగ్గురు హీరోలను నటింపజేయాలని అనీల్‌ రావిపూడి అనుకుంటున్నాడట. వరుణ్‌ తేజ్‌.. వెంకటేష్‌ లతో పాటు రవితేజను ఈ చిత్రంలో నటింపజేయాలని అనీల్‌ రావిపూడి అనుకున్నాడు. కాని రవితేజ మార్కెట్‌ డల్‌ గా ఉన్న కారణంగా నిర్మాత దిల్‌ రాజు ఆయన్ను వద్దంటున్నాడు. దాంతో అనీల్‌ రావిపూడి తన ఎఫ్‌ 3 చిత్రం కోసం మూడవ హీరో వేటలో పడ్డాడు. కొన్ని రోజుల క్రితం మహేష్‌ బాబు తో చర్చలు జరిపినట్లు గా కూడా వార్తలు వచ్చాయి.

ఎఫ్‌ 3 చిత్రంలో మహేష్‌ బాబు నటించడం నిజం కాదని అనీల్‌ రావిపూడి సన్నిహితులు అన్నారు. దాంతో దర్శకుడి మూడవ హీరో ప్రయత్నాలు కంటిన్యూ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎఫ్‌ 3 చిత్రాన్ని మొదలు పెట్టాలి అంటే మూడవ హీరో దొరకాలి.. ఆయనకు కథ నచ్చాలి.. ఆ సమయంకు వరణ్‌.. వెంకీలు ఖాళీగా ఉండాలి.. ముగ్గురు హీరోలకు డేట్లు కుదిరినప్పుడు ఎఫ్‌ 3 పట్టాలు ఎక్కేను. ఈ లెక్కన చూసుకుంటే 2022 సంక్రాంతికి ఎఫ్‌ 3 వచ్చేట్లుందిగా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.