Begin typing your search above and press return to search.

థియేటర్లు తెరిస్తే మొదట విడుదలయ్యే సినిమా ఏది?

By:  Tupaki Desk   |   26 May 2020 8:30 AM GMT
థియేటర్లు తెరిస్తే మొదట విడుదలయ్యే సినిమా ఏది?
X
ఈమధ్యే తెలంగాణా ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతినిచ్చింది. జూన్ లో షూటింగులు ప్రారంభం అవుతాయని అంటున్నారు. ఇప్పటికే కొందరు నిర్మాతలు షూటింగులకు సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. షూటింగుల సమస్యకు పరిష్కరం లభించింది. ఇదిలా ఉంటే థియేటర్లు రీ ఓపెన్ చేసే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కానీ మరో రెండు నెలల్లో థియేటర్లను కూడా తెరుస్తారని అంటున్నారు.

ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రెండు నెలల నుంచి ఎప్పుడెప్పుడు థియేటర్లు రీ ఓపెన్ చేస్తారా అని వాళ్లందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఓ చిక్కుంది. థియేటర్ రిలీజుకు రెడీగా ఉన్న ప్రతి నిర్మాత మొదటగా మాత్రం తమ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్దంగా లేడట. ఎవరైనా ముందుగా సినిమాను రిలీజ్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంది.. ప్రేక్షకులు వస్తున్నారా లేదా? కలెక్షన్స్ ఎలా ఉన్నాయి.. అన్నీ చూసుకుని తర్వాత రిలీజ్ చెయ్యాలని.. సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నారట. ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటే ఇక పిల్లి మెడలో గంటెవరు కడతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇది మీడియం రేంజ్.. పెద్ద సినిమాల సంగతి. చిన్న సినిమాల మేకర్లు మాత్రం పరిస్థితి అనుకూలంగా ఉంటే థియేటర్లలో రిలీజ్ చేద్దాం.. లేదంటే ఓటీటీ రిలీజుకు పోదామనే ఆలోచనలో ఉన్నారట. దీంతో థియేటర్లు తెరిచిన తర్వాత మొదటగా ఎవరు రిలీజ్ చేస్తారు.. ఏ నిర్మాత ఆ రిస్క్ తీసుకుంటాడు అనేది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న. మరి ఏ నిర్మాత ఆ రిస్క్ తీసుకుంటారో వేచి చూడాలి.