టాలీవుడ్ లో 'గొప్ప నటుడు' ఎవరు..?

Thu Feb 25 2021 07:00:02 GMT+0530 (IST)

Who is the Greatest Actor in Tollywood?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నలుగురు సీనియర్ హీరోలను పక్కన పెడితే అర డజను మంది మాత్రమే స్టార్ హీరోలు ఉన్నారు. సినిమా కలెక్షన్స్ ఫ్యాన్ బేస్ స్టార్ డమ్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుని స్టార్ హీరోలుగా గుర్తిస్తుంటారు. అయితే స్టార్ డమ్ ని పక్కన బెట్టి చూస్తే మరికొందరు యాక్టర్స్ నటన పరంగా బెస్ట్ అనిపించుకున్నవాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో 'ప్రస్తుతం టాలీవుడ్ లో గొప్ప నటుడు ఎవరు?' అనే దానిపై పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోడానికి 'తుపాకీ డాట్ కామ్' ఓ పోల్ నిర్వహించింది.టాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దగ్గుబాటి రానా - అల్లు అర్జున్ - నేచురల్ స్టార్ నాని - శర్వానంద్ - అల్లరి నరేష్ వంటి వారిని ఈ పోల్ లో పెట్టడం జరిగింది. ఇందులో అత్యధికంగా 43.00% మంది జూనియర్ ఎన్టీఆర్ ని గొప్ప నటుడిగా ఓటేసారు. నందమూరి తారకరామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. యాక్టింగ్ లో డైలాగ్ డెలివరీలో తనకు సాటిలేరని నిరూపించుకున్నారు. ముఖ్యంగా 'టెంపర్' సినిమా తర్వాత తనలోని నటుడిని బయటకు తీసిన తారక్ వరుస హిట్స్ అందుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో బెస్ట్ యాక్టర్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు.

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్.. సినిమా సినిమాకి నటనలో పరిణితి చూపిస్తున్నాడు. 'రంగస్థలం' సినిమాతో తనలోని యాక్టింగ్ స్కిల్స్ చూపించిన చరణ్ కు 12.03% మంది ఉత్తమ నటుడిగా ఓట్ వేశారు. ఇక వరుస విజయాలు అందుకుంటూ బెస్ట్ యాక్టర్ గా ఎన్నో అవార్డ్స్ అందుకున్న మహేష్ బాబు 10.29% ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఎలాంటి  బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నాని 8.94% ఓట్స్ తో నాలుగో ప్లేస్ లో ఉన్నాడు. ఒకవైపు కామెడీ చేస్తూనే మరోవైపు సీరియస్ రోల్స్ లో కూడా అదరగొడుతున్న అల్లరి నరేష్ ను 8.27% మంది ఉత్తమ నటుడిగా గుర్తించారు.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు అర్జున్ కి 6.16% మంది ఓటేసారు. ఇక వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ మంచి నటుడు అంటూ 5.77% మంది ఎన్నుకున్నారు. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ని 3.37% మంది మాత్రమే ఉత్తమ నటుడిగా ఓటేయడం గమనార్హం. అలానే దగ్గుబాటి రానాకు 2.17% మంది ఓటేశారు. స్టార్డమ్ పక్కనపెట్టి చూస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో గొప్ప నటుడు ఎవరనే దానిపై జనాల అభిప్రాయం ఈ విధంగా ఉంది.