అక్కినేని ఫ్యామిలీలో కొత్త మెంబర్ ఎవరు?

Wed Nov 20 2019 17:47:20 GMT+0530 (IST)

Who is new Person in Akkineni Family?

బర్త్ డే పార్టీలు అంటే మనలో మనకేనా? కుటుంబంలో కలిసిపోయి మనలో ఒక మెంబర్ గా తిరిగే పప్పీలు.. పిల్లులు.. గువ్వ పిట్టలకు అవసరం లేదంటారా? సరిగ్గా ఇలాంటి ఐడియానే వచ్చినట్టుంది అక్కినేని కోడలు సమంతకు. అనుకున్నదే తడవుగా తమ గారాల పప్పీ అక్కినేని హాష్ కి బర్త్ డే వేడుకలు జరిపారు. హాష్ అక్కినేనికి తొలి బర్త్ డే వేడుక ఇది. అక్కినేని ఫ్యామిలీ మెంబర్ గా అందరితో బాగా కలిసిపోయిన ఈ పప్పీ కోసం చై-సామ్ జంట హడావుడి మామూలుగా లేదు.సాక్షాత్తూ తమ ఇంట పుట్టిన బిడ్డకే ఇంత ఘనమైన పండగ చేయరేమో!  అన్నంతగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇల్లంతా అలంకరించి హ్యాష్ ఫ్రెండ్స్ ని పిలిచి చాలా సందడి చేశారు. దీనికి పలువురు ముఖ్య అతిధులు కూడా ఎటెండయ్యారట. అందులో సామ్ క్లోజ్ ఫ్రెండ్ ఫ్యాషన్ దేవత శిల్పా రెడ్డి కూడా ఉన్నారు. ఇకపై నవంబర్ 18 వచ్చిందంటే అక్కినేని అభిమానులంతా గుర్తుంచుకునేలా అక్కినేని హ్యాష్ బర్త్ డే వేడుక జరిగిందని తాజాగా రివీలైన ఫోటో చూస్తే అర్థమవుతోంది.

హ్యాష్ తో సామ్ అనుబంధం గురించి చెప్పేకంటే ప్రత్యక్షంగా చూస్తేనే బెటర్. ఆ పప్పీతో సమంత ఎంత క్లోజ్ అయిపోయిందో.. చై- సామ్ తనకు ఎంతగా క్లోజ్ అయిపోయారో కొన్ని ఫోటోలు చెబుతున్నాయి. సమంత - చై జంటకు పెళ్లి తర్వాత పరమ రొటీన్ గా ఓ కామన్ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. దానికి సమాధానం చెప్పకుండా ఇలాంటి సెలబ్రేషన్స్ తో సరిపెడుతున్నారన్నమాట ఇప్పటికి.