ఎవరీ సత్య ప్రియ జయదేవ్?

Sat Oct 01 2022 12:36:09 GMT+0530 (India Standard Time)

Who is Satyapriya Jayadev?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'గాడ్ ఫాదర్'. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' దీనికి ఆధారం. అక్టోబర్ 5న దసరా సందర్భంగా భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మోహన్ రాజా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీలోని ఇతర కీలక పాత్రల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార యంగ్ హీరో సత్యదేవ్ నటించారు.రామ్ చరణ్ తో కలిసి ఆర్.బీ. చౌదరి ఎన్. వి. ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి డ్యూయెట్స్ హీరోయిన్ లేకుండా ఓ ప్రయోగాత్మకంగా ఈ మూవీలో గ్యాండ్ స్టర్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఇంపాక్ట్ ని కలిగిస్తే రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ సంచలనంగా మారి సినిమాకు మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ట్రైలర్ లో చిరు చెప్పిన పొలిటికల్ డైలాగ్ లు కొత్త చర్చకు తెరలేపడమే కాకుండా 'గాడ్ ఫాదర్' హాట్ టాపిక్ అయ్యేలా చేశాయి.

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ మరో నాలుగు రోజులే వుండటంతో మేకర్స్ ప్రచార పర్వాన్ని మరింత స్పీడ్ చేశారు. ఇందులో భాగంగా శనివారం లేడీ సూపర్ స్టారఖ నయనతార పాత్రని పరిచయం చేస్తూ ఆమెకు సంబంధించిన మేకింగ్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నయనతార.. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మలయాళంలో ఈ పాత్రని మంజు వారియర్ పోషించింది.

తెలుగులో అదే పాత్రని నయనతార పోషించారు. సినిమాలో ఈ పాత్ర పేరు సత్య ప్రియ జయదేవ్. సెట్లో తానే మేకప్ వేసుకుంటున్న విజువల్స్ తో వీడియో మొదలై.. చిరు సత్యదేవ్ తో పతాక సన్నివేశాల్లో నటించడం.. చిరు తో కలిసి భావోద్వేగ సీన్ లలో పాలు పంచుకున్న తీరు ఆకట్టుకుంటోంది. తన చాలా వరకు సినిమాలో నయనతార ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ తో చీరకట్టులో కనిపిస్తోంది. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత వున్నట్టుగా మేకింగ్ వీడియోతో స్పష్టమవుతోంది.

ఇంతకీ సత్యప్రియ జయదేవ్ ఎవరు?.. ఏంటీ అన్నది తెలియాలంటే 'గాడ్ ఫాదర్' చూడాల్సిందే. గతంలో నయనతార.. మెగాస్టార్ తో కలిసి 'సైరా నరసింహారెడ్డి' మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇదే వీరిద్దరు హీరో హీరోయిన్ లుగా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా. దీని తరువాత మరోసారి కలిసి 'గాడ్ ఫాదర్'లో నటించారు. కానీ ఇందులో నయనతార హీరోయిన్ గా కాకుండా చిరుకు చెల్లెలిగా యంగ్ హీరో సత్యదేవ్ కు వైఫ్ గా కథకు కీలకంగా నిలిచే పాత్రలో నటించడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.