బిగ్ బాస్-3 హోస్ట్ ఎవరు? పార్టిసిపెంట్స్ ఎవరు?

Fri Apr 19 2019 12:15:42 GMT+0530 (IST)

Who is Host for Bigg Boss 3 Telugu?

ఎన్నికల సంగ్రామం ముగిసింది.. ఇక ఎంటర్ టైన్ మెంట్ సందడి మొదలైంది.. ఈరోజు జెర్సీ సినిమా విడుదలతో ఈ వేసవిలో సినిమాల సందడి మొదలు కాబోతోంది. మే 9న మహేష్ మహర్షి కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత కూడా అగ్రహీరోల సందడి కొనసాగనుంది.. సైరా సాహో సహా అన్నీ క్యూలో ఉన్నాయి..ఇక మే తర్వాత జూన్ లేదా జులైలో తెలుగింట మరో బుల్లితెర సందడి మొదలుకాబోతోంది. తెలుగువారి మదిని దోచి మూడు నెలల పాటు ఉర్రూతలూగించడానికి ‘బిగ్ బాస్’ మొదలు కానుంది. ఈసారి ఎంతో పకడ్బందీగా నిర్వహించడానికి సెలెబ్రెటీల ఎంపికను చేస్తున్నారు. ఎక్కడా లీక్ కాకుండా.. వారు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గతేడాది కౌశల్ విషయంలో జరిగిన రచ్చను ఈసారి పునరావృతం కాకుండా.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ క్లబ్ లకు తావులేకుండా హెల్దీ కాంపిటీషన్ నెలకొల్పాలని.. ప్రజలందరూ నిజాయితీగా ఓటువేసేలా పరిస్థితి కల్పించాలని బిగ్ బాస్ పార్టిసిపెంట్ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం అందులోని గోపత్యను ప్రదర్శిస్తోంది.

ఇక పోయిన సారి బిగ్ బాస్ వ్యాఖ్యతగా వ్యవహరించిన నాని కాడి వదిలేశారు. అందుకే ఇప్పుడు కొత్త బిగ్ బాస్ 3 హోస్ట్   ఎవరనే ఆసక్తి టాలీవుడ్ లో నెలకొంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో బుల్లితెరపై తొలిసారి వ్యాఖ్యానం చేసిన అగ్రహీరో నాగార్జున చేస్తాడా? లేక మొన్నటి బిగ్ బాస్ ఫైనల్ కు వచ్చిన వెంకటేశ్ చేస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. వీరిద్దరే కాదు.. మధ్యలో రానాను కూడా హోస్ట్ గా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ నాగార్జునకే కాస్త ఎక్కువ మొగ్గు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ విషయం అనేది జూన్-జూలై వరకే తెలిసే చాన్స్ ఉంది. అప్పటివరకూ బిగ్ బాస్ హోస్ట్ ఎవరు? పార్టిసిపెంట్స్ ఎవరనే ఉత్కంఠ మాత్రం వీడదు.. సో లెటస్ వెయిట్..