మెగా బయోపిక్ జరిగే పనేనా?

Wed Sep 18 2019 20:00:01 GMT+0530 (IST)

Who is Correct for Chiranjeevi Biopic?

ఇవాళ వాల్మీకి ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ గురించి ప్రస్తావన రావడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ అన్నయ్య చరణ్ చేయలేను అనుకుంటే నేను సిద్ధమని వరుణ్ తేజ్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి మెగా ఫామిలీలో ఆందరి కంటే పొడగరి అయిన వరుణ్ చిరు పాత్రకు పూర్తి న్యాయం చేయలేడు. అందులోనూ డాన్స్ విషయంలో ఇతగాడు వీకే. అవి లేకుండా చిరు కథను తెరకెక్కిస్తే అంత కన్నా కామెడీ ఉండదు.కాబట్టి డాన్స్ విషయంలో ముందుండే చరణ్ సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ లలో ఒకరు బెటర్ ఆప్షన్ అవుతారు. బ్లడ్ రిలేషన్ ప్రకారం చూసుకుంటే చరణ్ లేదా మేనల్లుడు తేజ్ రైట్ ఛాయస్ గా నిలుస్తారు. అందులోనూ సాయి ధరమ్ తేజ్ లో మేనమామ పోలికలు కాస్త కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఒకవేళ బయోపిక్ నిజమే అయితే తనను సెట్  ఆప్షన్ బాగానే ఉంటుంది. ఈ ముచ్చట్లన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి కానీ అసలు చిరంజీవి మనసులో తన కథ సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఉందో లేదో తెలియదు.

ఆ మధ్య నాగబాబు ఎన్టీఆర్ బయోపిక్ రిజల్ట్ తర్వాత మాట్లాడుతూ అన్నయ్య కెరీర్ లో చాలా స్ట్రగుల్ ఉన్నప్పటికీ అది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరమీద చూపలేమని కుండబద్దలు కొట్టేశాడు. చరణ్ కూడా ఆ ఆలోచన ఉన్నట్టు కనిపించలేదు. మరి వరుణ్ తేజ్ ఏదో యధాలాపంగా మీడియా అడిగింది కాబట్టి ఇలా అన్నాడా లేక నిజంగానే దీనికి సంబంధించిన ప్రతిపాదన కుటుంబంలో ఉందా ఇంకొంత కాలం ఆగితే సమాధానం దొరకొచ్చు