'ఆది పురుష్' తెలుగు రైట్స్ ఎవరికి దక్కాయి?

Mon Aug 15 2022 16:17:40 GMT+0530 (IST)

Who has got the Telugu rights of 'Adi Purush'?

'బాహుబలి' సిరీస్ సినిమాల తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత తను చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మేకర్స్ కూడా ప్రభాస్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని వంద కోట్ల భారీ బడ్జెట్ లతో సినిమాలు నిర్మిస్తున్నారు. దీంతో ప్రభాస్ సినిమాలకు బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతూ వస్తోంది. భారీ పోటీ కూడా నెలకొంటోంది.ఇప్పడు అలాంటి పోటీనే ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ 'ఆది పురుష్' విషయంలో నెలకొందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో మైథలాజికల్ మూవీ 'ఆది పురుష్'లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

మరో రెండు సినిమాలు 'సలార్' ప్రాజెక్ట్ కె దాదాపు యాభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. ఈ మూడు సినిమాలలో ముందుకు ప్రేక్షకుల ముందుకు మైథలాజికల్ డ్రామా 'ఆదిపురుష్' రిలీజ్ కాబోతోంది. వాల్మీకీ రామయణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. జపనీస్ మూవీ 'రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా స్ఫూర్తితో  టి. సిరీస్ రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై  అధినేతలు భూషన్ కుమార్ కిషన్ కుమార్ ఓం రౌత్ ప్రసాద్ సుతార్ రాజేష్ నాయర్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ. 500 కోట్లతో నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరి 12న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా హిందీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానుంది. హిందీలో ఈ మూవీని అనిల్ తడానీ భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగు రిలీజ్ కు సంబంధించిన తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది.

ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొందట. అయితే ఈ పోటీలో ప్రభాస్ కు సంబంధించిన యువీ క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 100 కోట్లకు దక్కించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా విదేశాల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ మూవీ తెలుగు రైట్స్ విషయంలో మాత్రం యువీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. తాజా డీల్ ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే యువీ వారు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.