ప్రియమణిని బ్లాకీ అని పిలిచిందెవరు?

Mon Jun 14 2021 14:00:01 GMT+0530 (IST)

Who called priyamani Blackie?

జాతీయ ఉత్తమ కథానాయిక ప్రియమణికి అవమానం ఎదురైందా?  తనని నల్లగా ఉన్నావని లావుగా ఉన్నావని అవమానించారా? అంటే అవుననే తెలిపారు. `ఫ్యామిలీ మ్యాన్స్ 2` సక్సెస్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అవమానాల గురించి ప్రియమణి ఎలాంటి భేషజం లేకుండా రివీల్ చేశారు. తాను బాడీ షేమింగ్ కి గురయ్యానని.. కలరిజం సెగను అనుభవించానని తెలిపారు. కొందరు తనను బ్లాకీ అని పిలిచారని అన్నారు.తన ముదురు రంగుపై కామెంట్లను ఎన్నోసార్లు విన్నానని ప్రియమణి చెప్పారు. తన రంగు గురించి ఇన్ స్టా ఫోటోలపై చాలా మంది వ్యాఖ్యానించారని చెప్పారు. తన బరువు గురించి కామెంట్లు ఎదురయ్యాయట. నిజాయితీగా చెప్పాలంటే నా బరువు 65 కిలోల వరకు పెరిగింది. దాంతో ప్రస్తుత వయసు కంటే పెద్దదానిగా కనిపించాను. కాబట్టి చాలా మంది లావుగా ఏజ్డ్ గా కనిపిస్తున్నారు తగ్గాలని అన్నారట. కానీ ప్రజలు అవేవీ పట్టించుకోలేదు. మీరు ఎందుకు సన్నగా కనిపిస్తున్నారు? లావుగా ఉంటేనే మిమ్మల్ని ఇష్టపడతామని అన్నారు.

మీరు నల్లగా చీకటి రంగులో కనిపిస్తున్నారు.. మీ ముఖం తెల్లగా ఉంది.. కానీ మీ కాళ్ళు నల్లగా ఉన్నాయి వంటి వ్యాఖ్యలు తాను తరచుగా విన్నానని ప్రియమణి తెలిపారు. నలుపు తెలుపు గోధుమ రంగు ఏదైతే ఏంటి?  లావు సన్నం ఇవన్నీ అడ్డంకులా? అని ప్రియమణి ప్రశ్నించారు.

శ్రీకృష్ణుడు నల్ల రంగులో ఉన్నా అందంగా ఉన్నాడు. నలుపులోనూ అందగాడే.. ఇలా వ్యాఖ్యానించవద్దు. ఏదైనా ఉన్నా దాన్ని మీ మనస్సులో ఉంచుకోండి. ఇలా మాట్లాడి ప్రతికూలతను ఎందుకు వ్యాప్తి చేయాలనుకుంటున్నారు? అలా చేయకండి అని అన్నారు.

ప్రియమణి తదుపరి సైనైడ్ అనే చిత్రంతో పాటు అజయ్ దేవ్‌గన్ మైదాన్ లో కనిపించనున్నారు. తెలుగు బుల్లితెరపై డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగానూ ప్రియమణి బిజీ. `ఫ్యామిలీ మ్యాన్స్ 2` లో మనోజ్ భాజ్ పాయ్ భార్యగా ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.