Begin typing your search above and press return to search.

నితిన్ వివాహానికి గెస్టులు ఎవరు...?

By:  Tupaki Desk   |   2 July 2020 8:10 AM GMT
నితిన్ వివాహానికి గెస్టులు ఎవరు...?
X
టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి చేసుకోగా దగ్గుబాటి రానా ఆగస్టు 8న పెళ్లిపీటలు ఎక్క్కబోతున్నాడు. ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ - షాలినిల పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో జూలై 26న వైభవంగా నిర్వహించబోతున్నారు.

నిజానికి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న నితిన్ - షాలిని జంట దుబాయ్‌ లో ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ క‌రోనా మహమ్మారి దెబ్బతో ప్లాన్ అంతా తారుమారైంది. విదేశాలకు వెళ్లే అవకాశం లేకపోవడం.. ప్రస్తుత పరిస్థితిలో పెళ్లి చేసుకొనే ఆలోచన విరమించుకొని.. పరిస్థితులన్నీ చక్కబడ్డ తరువాతే వివాహం చేసుకోవాలని నితిన్ అనుకున్నారట. అయితే ఇప్పట్లో పరిస్థితులు చక్కబడేలా కనిపించకపోవడంతో ఇక పెళ్లి పనులు స్టార్ట్ చేసారు నితిన్. ఈ క్రమంలో జూలై 26న వివాహ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ ని అనుసరించి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని వివాహం జరిపించడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే నితిన్ - షాలిని వివాహం పెళ్లి వేడుక ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది ప్రముఖుల మధ్యలో జరిపించాలని అనుకుంటున్నారట. మరి సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు హీరో నితిన్ వివాహానికి హాజరవుతారో చూడాలి. ఇక రానా - మిహిక ల వివాహం కూడా ఆగస్టు 8న తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లోనే నిర్వహించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.