ఎన్టీఆర్ తో జత కట్టే ఆ లక్కీ బ్యూటీ ఎవరు...?

Wed Jul 08 2020 13:00:41 GMT+0530 (IST)

Who's that lucky beauty who ties up with NTR?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాధాకృష్ణ (చిన్నబాబు) - నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిజానికి ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే కరోనా వచ్చి అన్ని ప్లాన్స్ తారుమారు చేసింది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్ కి మెరుగులు దిద్దే పనిలో ఉన్న త్రివిక్రమ్ నటీనటులను కూడా ఫైనలైజ్ చేసే పనిలో పడ్డాడట. ఇక ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి తారక్ కి జోడీగా ఎవరు నటించబోతున్నారు అని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.ఇప్పటికే అనేక మంది హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అధికారిక ప్రకటనైతే రాలేదు. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందట. అందులో ఒక హీరోయిన్ గా పూజాహెగ్డేని అనుకుంటున్నారని న్యూస్ వచ్చింది. ఆ తర్వాత అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఒక హీరోయిన్ ని బాలీవుడ్ ని తీసుకురావాలని డిసైడ్ అయ్యారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ బ్యూటీస్ ని ఎన్టీఆర్ సినిమాలో నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. మొత్తం మీద ఎన్టీఆర్ పక్కన నటించే ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

కాగా ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రానున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సామాజిక అంశాన్ని ప్రస్తావించబోతున్నారట. 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత తారక్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఇక ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో తన పార్ట్ చిత్రీకరణ కంప్లీట్ చేసిన వెంటనే తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలున్నాయి.