టాలీవుడ్ నెం.1 హీరోయిన్ ఎవరు..?

Sun Apr 18 2021 08:00:01 GMT+0530 (IST)

Who Is The No 1 Heroine In Tollywood Right Now

రోజుకో కొత్త బ్యూటీ పరిచయం అవుతున్న సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. అయితే టాలీవుడ్ లో ఈ పోటీని తట్టుకుని వరుస అవకాశాలతో ముగ్గురు హీరోయిన్లు హవా చూపిస్తున్నారు. వారే పూజాహెగ్డే - రష్మిక మందన్నా - సాయి పల్లవి. ప్రస్తుతం  ఈ ముగ్గురు ముద్దుగుమ్మల మధ్యే ప్రధాన పోటీ ఉంది. పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న రష్మిక మందన్నా.. పెద్ద సినిమాలు చేసి బాలీవుడ్ కు వెళ్లిపోయిన పూజా హెగ్డే.. డ్యాన్స్ తో పాటు తన పర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్న సాయిపల్లవి.. ఈ ముగ్గురే నెంబర్ వన్ ప్లేస్ కోసం పోటీపడుతున్నారు.కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగులో 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అలానే 'ఆడాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా చేస్తోంది. గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' 'భీష్మ' వంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందుకుంది. బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్న రష్మిక.. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. బుట్టబొమ్మ పూజాహెగ్డే లాస్ట్ ఇయర్ 'అల వైకుంఠపురంలో' సినిమాతో మాంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో 'రాధేశ్యామ్' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలు చేస్తోంది. అలానే బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఇక 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ప్రస్తుతం 'లవ్ స్టోరీ' 'విరాటపర్వం' చిత్రాల్లో నటిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ రష్మిక మందన్నా అని టాలీవుడ్ నిపుణులు అంటున్నారు. పూజాహెగ్డే గత రెండేళ్లుగా త్రివిక్రమ్ సినిమాల్లో తప్పితే మరే తెలుగు సినిమాలో కనిపించకపోవడంతో ఈ బ్యూటీ రెండో స్థానంలో ఉందని చెబుతున్నారు. అయితే నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న సాయి పల్లవి.. ఇలాంటి ర్యాకింగులతో సంబంధం లేకుండా మాస్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.