ఈసారి గెలిచేదెవరు ?

Fri Dec 13 2019 07:00:01 GMT+0530 (IST)

Who Is Going To Win This Time?

సీనియర్ల మధ్య ఈ మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. ఫుల్ జోష్ తో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే నందమూరి బాలయ్య విక్టరీ వెంకటేష్ ఇద్దరూ సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. బాలయ్య 'ఎన్టీఆర్ కథానాయకుడు' తో వచ్చి ఘోర అపజయం అందుకుంటే వెంకీ మాత్రం తన కామెడీ టైమింగ్ తో అదరగోట్టేసి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు.అయితే మళ్ళీ ఒకే నెలలో వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వెంకీ మామ డిసెంబర్ 13 న రిలీజ్ అవుతుంటే బాలయ్య 'రూలర్' 20 న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ఈ సారి వీరిద్దరి గెలిచేదెవరు అనే డిస్కర్షన్ నడుస్తోంది. మరి ఈ నెలలో ఏ సీనియర్ హీరో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.