అద్భుతమైన ‘దృశ్యం’.. మోహన్ లాల్ కేసు గెలిపించిన నిజమైన లాయర్!

Tue Feb 23 2021 10:21:50 GMT+0530 (IST)

Who Is Advocate Santhi Mayadevi

మోహన్ లాల్ మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 2013 మలయాళ బ్లాక్‌బర్ చిత్రం ‘దృశ్యం’. ఈ మూవీ అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే మూవీని తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చింది. ‘దృశ్యం-2’ పేరుతో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ టాక్ తో దూసుకెళ్తోంది. కాగా.. ఈ సినిమాలో మోహన్ లాల్ ను రక్షించే పాత్రలో నటించిన లాయర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. రేణుక పాత్రలో మెప్పించిన ఆ లాయర్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు.లాయర్ పాత్రలో అదరగొట్టిన ఆమె శాంతి మాయాదేవి అలియాస్ శాంతి ప్రియ. ఈమె మొదటగా 2019లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘గానగంధర్వన్’ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ సినిమాలోనూ మమ్ముట్టిని కాపాడే లాయర్ పాత్ర పోషించారు. ఆమె నటన కు మంచి మార్కులు పడడంతో.. తాజాగా ‘దృశ్యం 2’ లో మోహన్ లాల్ ను సేవ్ చేసే పాత్రలో కనిపించారు.

అయితే.. ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. ఆమె రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ లాయరే! అవును.. దేశంలోనే అక్షరాస్యతలో అగ్రగామిగా ఉన్న కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన శాంతి ప్రియ లా గ్రాడ్యేయేషన్ చేసి సైబర్ లా డిప్లొమా చేశారు. ఆ తర్వాత ఎర్నాకులంలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. సుప్రీంకోర్టులో శబరిమల కేసులోనూ ఈమె భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం కేరళ హై కోర్టులోనూ కేసులు వాదిస్తున్నారు శాంతి ప్రియ. కొన్నాళ్లు ఏషియా నెట్‌కి చెందిన ‘అమృత’ టీవీ లో యాంకర్ గా పని చేశారు. అంతే కాదు.. శాంతి ప్రియ ప్రముఖ కాలమిస్టు గా సోషల్ యాక్టివిస్టు కూడా పని చేస్తున్నారు.