మృణాల్ హాట్ కంటెంట్ పెంచేస్తోందిగా..

Sat Oct 01 2022 09:38:39 GMT+0530 (India Standard Time)

While Mrunal Thakur is increasing hot content..

దుల్కార్-మృణాల్ ఠాకూర్- రష్మిక మందన ప్రధాన తారాగణంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా 'సీతారామం' ఆగస్ట్ 5న తెలుగు- తమిళం- మలయాళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెసైన సంగతి తెలిసిందే.పెన్ స్టూడియోస్  డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పణలో ఈ చిత్రం హిందీలో సెప్టెంబర్ 2న సినిమా థియేటర్లలో విడుదలైంది.

అక్కడా చక్కని ఆదరణ దక్కించుకుంది. హిందీ పరిశ్రమకు సుపరిచితురాలైన అందాల కథానాయిక మృణాల్ ఠాకూర్ తనవంతు ప్రచారం తో అభిమానులకు మరింత చేరువైంది. నేను దక్షిణాది సినిమాల్లో ఇంతకంటే మంచి అరంగేట్రాన్ని కోరుకోను.. నేను పొందుతున్న ప్రేమ అపురూపమైనదని మృణాల్ ఇంతకుముందే ఆనందం వ్యక్తం చేసింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా కథాంశం ఆసక్తికరం.

ఈ మూవీ కథ దేశభక్తి చుట్టూ తిరుగుతుంది. ఇందులో దుల్కార్ సల్మాన్ అందమైన హంక్ ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు. ఈ సినిమాలో దుల్కర్.. మృణాల్ నటనకు ప్రశంసలు తతదక్కాయి. యుద్ధం సరిహద్దులు మతం కంటే మానవత్వమే ముఖ్యమన్న వాస్తవాన్ని హను తెరపై ఎంతో హృద్యంగా అందంగా చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చేరువైంది.

ఇటీవల మృణాల్ ఫోటోషూట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మృణాల్ షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ అంతర్జాలంలో దుమారం రేపింది. వన్స్ అప్ ఆన్ ఏ డ్రీమ్! అంటూ మృణాల్ ఒక అందమైన క్యాప్షన్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.

మునుపటి కంటే ఈ బ్యూటీ అందాల ఎలివేషన్ లో హద్దులు చెరిపేస్తోందని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. ఎక్స్ పోజింగ్ పరంగానూ మృణాల్ మరో లెవల్ చూపిస్తోంది. సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూనే ఇలా గ్లామరస్ యాంగిల్ ని ఆవిష్కరిస్తోంది. తదుపరి వరుస చిత్రాలకు సంతకాలు చేసే పనిలో బిజీగా ఉందని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.