బిబి3 తర్వాత బాలయ్య చేయబోతున్న మూవీ ఏది?

Sun Oct 18 2020 15:00:06 GMT+0530 (IST)

Which movie is Balayya going to do after BB3?

నందమూరి బాలకృష్ణ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నారు. ప్రస్తతుం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. గతంలో సింహా మరియు లెజెండ్ లు బోయపాటి దర్శకత్వంలో చేయగా బాలయ్యకు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించాయి. కనుక ఈ సినిమా మరింత విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బిబి3 మూవీ తర్వాత బాలకృష్ణ బి గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమా మాత్రమే కాకుండా మరికొన్ని కూడా చర్చల దశలో ఉన్నాయంటున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ రచయిత ఎమ్ రత్నం ఒక కథను బాలయ్యకు వినిపించాడట. బాలయ్య తన బాడీలాంగ్వేజ్ కు మరియు ఇమేజ్ కు తగ్గట్లుగా ఆ కథ ఉందంటూ ఫీల్ అయ్యి వెంటనే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ కథ చర్చలు జరుగుతున్నయని బోయపాటి మూవీ పూర్తి అయిన వెంటనే తప్పకుండా చేయాలనే పట్టుదలతో బాలయ్య ఉన్నాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే బాలయ్య మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా ఓకే చేశాడు. కనుక బాలయ్య ఏం చేయబోతున్నాడు బిబి3 తర్వాత ఎవరి తో వర్క్ చేయబోతున్నాడు అనేది చర్చనీయాంశంగా ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో బాలయ్య కొత్త సినిమా ప్రారంభించే అవకాశాలున్నాయి. అప్పటి వరకు బాలయ్య కొత్త సినిమా ఎవరితో అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.