Begin typing your search above and press return to search.

`క్రాక్` లో ఏ బాలీవుడ్ హీరో న‌టిస్తే బెస్ట్?

By:  Tupaki Desk   |   25 Jan 2021 12:30 AM GMT
`క్రాక్` లో ఏ బాలీవుడ్ హీరో న‌టిస్తే బెస్ట్?
X
మాస్ మ‌హారాజ్ రవితేజ- శ్రుతి హాసన్ నాయ‌కానాయిక‌లుగా నటించిన `క్రాక్` సంక్రాంతి కానుక‌గా థియేటర్లలోకి విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీతోనూ ఈ మూవీ అద్భుత వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోవ‌డం భ‌విష్య‌త్ పై పాజిటివిటీని పెంచింది.

క్రాక్ పోలీస్ గా మాస్ రాజా న‌ట‌న‌కు మాస్ ఫ్యాన్స్ విజిల్స్ వేశారు. శ్రుతి అంద‌చందాలు న‌ట‌న అస్సెట్ అయ్యింది. ఇక గోపీచంద్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే .. హీరోయిజం ఎలివేష‌న్ హైలైట్. అందుకే ఈ మూవీపై ప‌లువురు బాలీవుడ్ హీరోల క‌న్ను ప‌డింద‌ని తెలిసింది. ఒక‌వేళ ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే ఏ హీరో న‌టిస్తే బావుంటుంది? అన్నది నేరుగా ద‌ర్శ‌కుడు గోపీచంద్ నే ప్ర‌శ్నిస్తే ఆయ‌న ఇచ్చిన స‌మాధానం ఆస‌క్తిక‌రం.

ఈ యాక్ష‌న్ డ్రామాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఆస‌క్తిగా ఉన్నానని గోపీచంద్ మ‌లినేని వెల్లడించారు. రణ్ వీర్ సింగ్ లేదా అజయ్ దేవ్ గన్ ‌లను ఇందులో నటించాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ర‌ణ్ వీర్ లాంటి ఎన‌ర్జిటిక్ హీరో ఇందులో న‌టిస్తే బంప‌ర్ హిట్టే. ఇంత‌కుముందు అత‌డితో తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ `టెంప‌ర్` ని రీమేక్ చేస్తే అది అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. సింబా టైటిల్ తో రోహిత్ శెట్టి ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు క్రాక్ ని అదే టైటిల్ తో గోపీచంద్ తో బాలీవుడ్ లో రీమేక్ చేస్తే వ‌ర్క‌వుట‌య్యే ఛాన్సెస్ లేక‌పోలేదు.