'ఆర్ఎక్స్ 100' హీరో జాడ ఎక్కడా కనిపించడం లేదేంటి?

Sat Jun 25 2022 18:00:01 GMT+0530 (IST)

Where is RX100 Hero

కార్తికేయ గుమ్మకొండ.. ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 'ప్రేమతో మీ కార్తీక్' అనే మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ యంగ్ హీరో.. 'ఆర్‌ఎక్స్ 100' మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన కార్తికేయ.. 'ఆర్ఎక్స్ 100' స్థాయిలో హిట్టైతే కొట్టలేకపోయాడు.ఇటీవల 'వలిమై' మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడీయన. అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ మూవీలో కార్తికేయ విలన్ గా నటించాడు.

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఇటు తెలుగులో చివరిగా కార్తికేయ 'రాజా విక్రమార్క'తో ప్రేక్షకులను పలకరించగా.. ఇది కూడా అలరించలేకపోయింది.

ఇకపోతే ఈ మూవీ వచ్చి ఏడాది కావొస్తున్నా కార్తికేయ నుంచి మరో సినిమా రాలేదు. అసలు కార్తికేయ జాడ ఎక్కడ కనిపించడం లేదు. వరుస ఫ్లాపులు పడటం వల్ల కెరీర్ కూడా చాలా డౌన్ అయింది. ప్రస్తుతం ఈయన చేతిలో ఏవో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రశాంత్ చంద్ర దర్శకత్వంలో ఓ మూవీ లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేసేందుకు కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ తో ఆయిన 'ఆర్ఎక్స్ 100' హీరో సక్సెస్ ట్రాక్ ఎక్కి కెరీర్ పరంగా ఊపందుకుంటాడా..? లేదా..? అన్నది చూడాలి. కాగా ఆ మధ్య ఈ యంగ్ హీరో ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి లోహితను గత ఏడాది నవంబర్ లో కుటుంబసభ్యులు సన్నిహితల నడుమ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తణికెళ్ల భరణి అజయ్ భూపతి సాయి కుమార్ పాయల్ రాజ్ పుత్ తో సహా పలువురు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వివాహం అనంతరం తరచూ భార్యతో వెకేషన్స్ కు వెళ్తూ ఫ్యామిలీ లైఫ్ ను కార్తికేయ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.