Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎక్కడ?

By:  Tupaki Desk   |   5 Dec 2022 5:03 AM GMT
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎక్కడ?
X
మెగా హీరో వరుణ్ తేజ్ సందడి కనిపించడం లేదు. ఈ ఏడాది గని మరియు ఎఫ్‌ 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా హీరో తదుపరి విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మధ్య ప్రవీణ్‌ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా సినిమా ప్రారంభం అయ్యింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ లో ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా కూడా ప్రకటన వచ్చింది.

వరుణ్ తేజ్ మరియు ప్రవీణ్‌ సత్తార్‌ కాంబో సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వరుణ్ తేజ్ పై నాగ బాబు క్లాప్ కూడా కొట్టాడు.

ఆ కార్యక్రమాలు ఈ ఏడాది మార్చి లో జరిగాయి. షూటింగ్ ప్రారంభోత్సవం అయ్యి దాదాపుగా పది నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రెగ్యులర్‌ షూట్‌ కు వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు.

గని మరియు ఎఫ్ 3 సినిమాల ఫలితాల విషయంలో వరుణ్ తేజ్ ఒకింత అసంతృప్తితో ఉన్నాడు. పైగా ప్రవీణ్‌ సత్తార్ కూడా తన గత చిత్రం ది ఘోస్ట్‌ తో పరాజయంను మూట కట్టుకున్నాడు. ఈ సమయంలో వీరి కాంబో మూవీ అంటే ప్రేక్షకుల్లో పెద్దగా బజ్‌ ఉండే అవకాశం ఉండదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ కారణంగానే వీరి కాంబో మూవీని హోల్డ్‌ లో పెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి వరుణ్ తేజ్ ఏ ఒక్క సినిమాలో కూడా నటిస్తున్నట్లుగా అప్‌డేట్‌ రావడం లేదు.

వచ్చే ఏడాదిలో అయినా వరుణ్ తేజ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందేమో చూడాలి. షూటింగ్‌ లో పాల్గొనకున్నా అసలు వరుణ్ తేజ్ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా క్లారిటీ రావడం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.