'శేఖర్' ఎటు వెళ్లాడు? 'మర్మాణువు' ఏమైంది?

Mon May 03 2021 13:20:14 GMT+0530 (IST)

Where did 'Shekhar' go? What is a 'mystery'?

రాజశేఖర్ కి యాక్షన్ హీరోగా .. ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ ఉంది. ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతమైపోయిన ఆయన ఆ తరువాత 'గరుడ వేగ'తో ఊపిరి పీల్చుకున్నారు. కొత్త కాన్సెప్ట్ తో 'కల్కి' సినిమా చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆడలేదు. అప్పటి నుంచి రాజశేఖర్ మంచి కథల కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. రొటీన్ గా భిన్నంగా ఉండే సినిమాలు చేయాలనే ఉద్దేశంతో వైవిధ్యభరితమైన కథలపైనే ప్రత్యేక దృష్టిపెట్టారు.సరైన కథను వెతికి పట్టుకోవడంలోనే కొంతకాలం గడిచిపోయింది. దానికి లాక్ డౌన్ కూడా తోడైంది. ఈ సమయంలో రాజశేఖర్ కూడా కథలను సెట్ చేసుకునే ఉంటారని అభిమానులు అనుకున్నారు. అలాగే ఆయన పుట్టిన రోజున రెండు సినిమాలకి సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. ఒక సినిమా 'శేఖర్' అయితే మరొకటి 'మర్మాణువు'. లలిత్ దర్శకత్వంలో 'శేఖర్' రూపొందుతుండగా ఈ థ్రిల్లర్ మూవీకి ఎమ్ ఎల్ వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.  

ఇక 'మర్మాణువు' టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.'కేరాఫ్ కంచర పాలెం' .. 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్ మహ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే కరోనా ఉధృతి పెరగడానికి ముందు కూడా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్లు లేవు. ఏ సినిమా ఎంతవరకూ వచ్చిందనేది తెలియదు. ఆ సినిమాల విషయాలు .. విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలంతో అభిమానులు ఉన్నారు. మరి మేకర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.