చిరంజీవి..మహేష్..బన్నీ ఎక్కడున్నారో తెలుసా?

Wed May 25 2022 11:49:54 GMT+0530 (IST)

Where are our Tollywood Heros?

అలసిసొలసిన స్టార్స్ షూటింగ్ అనంతరం వెకేషన్ మోడ్ లోకి వెళ్లిపోతారు. ఫ్యామిలీతో కలిసి అలా వారం-పది రోజులు విదేశాల ఆస్వాదనకు వెళ్లిపోతారు. కొన్ని రోజులు పాటు ఎలాంటి ఆలోచన లేకుండా రీ ఫ్రెష్ అవుతారు. మళ్లీ ఫ్రెష్ బ్రెయిన్ తో షూటింగ్ ల్లో జాయిన్ అవుతుంటారు. పైగా కరోనా వైరస్  హడావుడి మొదలైన దగ్గర నుంచి చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమైపోయారు.గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితిని ఫేస్ చేసారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అంతగా లేకపోవడంతో ఒక్కొక్కరుగా విదేశాలు వెకేషన్ కి వెళ్తున్నారు.  ఇప్పటికే మెగాస్టార్  చిరంజీవి సతీమణి సుకేఖతో కలిసి అమెరికా-యూరప్ ట్రిప్ కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.' ఆచార్య' రిలీజ్ అనంతరం చిరంజీవి మరో ఆలోచన లేకుండా అమెరికా ప్లైట్ ఎక్కేసారు.

మే 3న ఆయన ప్రయాణం  మొదలైంది. ముందుగా అమెరికా వెళ్లారు. అక్కడ నుంచి యూరప్ ఖండాన్ని మొత్తాన్ని చుట్టేయనున్నారు. సురేఖతో కలిసి చాలా కాలం తర్వాత ప్లాన్ చేసుకున్న ట్రిప్ ఇది. అందుకే ఈసారి లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈవీకెండ్  లో హైదరాబాద్ చేరు కుంటారని సమాచారం.

వచ్చిరాగానే 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో జాయిన్ అవుతారు. చిరంజీవి..సల్మాన్ ఖాన్ పై ప్రభుదేవా ఓ సాంగ్ కంపోజ్ చేయనున్నారు. ఇక నెల రోజుల గ్యాప్ లోనే సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ ఏకంగా  రెండుసార్లు వెకేషన్  కి  వెళ్లారు.  'సర్కారు వారి పాట' రిటీజ్ కి  ముందు  ఏప్రిల్  నెలఖర్లో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ కి  వెళ్లారు.

సరిగ్గా రిలీజ్ కి ముందు ప్రమోషన్ కోసం ట్రిప్ ముగించుకుని వచ్చేసారు.  మళ్లీ  రిలీజ్ తర్వాత యూరప్ ట్రిప్ వెళ్లిపోయారు. ప్రస్తుతం యూరిప్ లోనే ఉన్నారు. వెకేషన్ ముగించుకున్న అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ లో  పాల్గొంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సతీమసేతంగా లండన్  టూర్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

'పుష్ప-2' చిత్రీకరణ ప్రారంభమైతేల సినిమాకి  బాండ్ అయి పనిచేయాల్సి  ఉంటుంది.  రెస్ట్ లెస్ గా వర్క్ చేయాలి. ఖాళీ సమయం అనే మాటే ఉండదు. అందుకే ఉన్న సమయాన్నే ఆస్వాదించాలని బన్నీ ఫ్యామిలీతో కలిసి ప్లైట్ ఎక్కేసారు. టూర్ బోర్ కొట్టేంత వరకూ వె కేషన్ మోడ్ లోనే ఉంటారు. అటుపై స్వదేశానికి చేరుకుంటారు.