చిరు 'భోళా శంకర్' వచ్చేది అప్పుడేనా?

Tue Dec 06 2022 11:35:58 GMT+0530 (India Standard Time)

When Will Chiru Bhola Shankar come

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతీ హీరో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఒక్కో హీరో చేతిలో ప్రస్తుతం రెండు నుంచి మూడు ప్రాజెక్ట్ లున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్ ని బ్యాక్ టు బ్యాక్ పట్టాలెక్కిస్తూ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. కొంత మంది పూర్తియిన సినిమాలతో థియేటర్లలోకి వచ్చేస్తుంటే మరి కొంత మంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలని రెడీ చేసే పనిలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోలు కూడా వున్నారు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాబి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'. చాలా కాలం తరువాత చిరు ఊర మాస్ పాత్రలో 'ముఠామేస్త్రి' అందరివాడు చిత్రాల తరహా మేకోవర్ తో చేస్తున్నమూవీ ఇది.

దీంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో కనిపించబోతుండగా చిరకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది.

కేథరిన్.. రవితేజ సరసన నటిస్తోంది. సవతి సోదరుల కథగా సాగే ఈ మూవీని వైజాగ్ నేపథ్యంలో దర్శకుడు బాబి అత్యంత పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీని 2023  సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. డేట్ ప్రకటించకపోయినా సంక్రాంతి బరిలో నిలిచే అ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని మైత్రీ వారు ఇప్పటికే ప్రారంభించేశారు. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ ఊర్వశీ రౌతేలా చిరు పాల్గొనగా 'బాస్ పార్టీ' అంటూ ఫస్ట్ లిరికల్ వీడియోని రీసెంట్ గా విడుదల చేయాడం.. ఆ పాట ఆకట్టుకుఓవడం తెలిసిందే.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు చిరంజీవి 'భోళా శంకర్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమిళ బ్లాక్ బస్టర్ 'వేదాలం' ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ మూవీలో చిరుకు సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. చిరు అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి హోప్ పెట్టుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జనవరి మొదటి వారం నుంచి ప్రారంభించబోతున్నారు. సమ్మర్ లో ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్మాత అనిల్ సుంకర ప్లాన్ చేస్తున్నారట. చిరుకు చెల్లెలి పాత్ర కోసం ముందు సాయి పల్లవి ని టీమ్ సంప్రదించింది. చిరు కూడా స్వయంగా అడిగినా తను ఓకే చెప్పకపోవడంతో ఫైనల్ గా కీర్తి సురేష్ ని ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. ఇందులో చిరుకు జోడీగా తమన్నా నటిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.