Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: నేచుర‌ల్ స్టార్ డ‌బుల్ గేమ్!

By:  Tupaki Desk   |   23 April 2019 8:56 AM GMT
ట్రెండీ టాక్‌: నేచుర‌ల్ స్టార్ డ‌బుల్ గేమ్!
X
గ‌త కొంత‌కాలంగా నాని- సుధీర్ బాబు కాంబినేష‌న్‌ మ‌ల్టీస్టార‌ర్ గురించిన‌ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టించ‌నుండ‌గా.. ఎన‌ర్జిటిక్ హీరో సుధీర్ బాబు పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నార‌ని, ఇప్ప‌టికే క‌థానాయిక‌ల్ని లాక్ చేశార‌ని ప్ర‌చార‌మైంది. నాని స‌ర‌స‌న అదితీరావ్ హైద‌రీ.. సుధీర్ బాబు స‌ర‌స‌న నివేద థామ‌స్ పేర్లు వినిపించాయి. వ్యూహం అనే టైటిల్ వినిపించినా .. అంత‌కుమించిన గ‌మ్మ‌త్త‌యిన టైటిల్ ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రానికి సైరా, సాహో లాంటి భారీ చిత్రాల‌కు సంగీతం అందిస్తున్న‌ అమిత్ త్రివేది లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ని ఎంపిక చేయ‌డం ఆస‌క్తి పెంచుతోంది. ప్ర‌స్తుతం అత‌డు ఈ మ‌ల్టీస్టార‌ర్ కు బాణీల్ని రెడీ చేసే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. అమిత్ కి ఇది తెలుగులో మూడో సినిమా. ఈ ఏడాది బాలీవుడ్ లో మిష‌న్ మంగళ్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ లాంటి క్రేజీ చిత్రాల‌కు సంగీతం అందిస్తూనే తెలుగు చిత్రాల‌కు ప‌ని చేస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. నాని - సుధీర్ బాబు మ‌ల్టీస్టార‌ర్ ని ఈ బుధ‌వారం ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ అందుకు సంబంధించిన అధికారికంగా మీడియాకి ఎలాంటి సమాచారం లేదు. అంటే దీనిని బ‌ట్టి ఎలాంటి మీడియా హంగామా లేకుండానే లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేస్తారా? అంటూ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. నాని న‌టించిన జెర్సీ ఇటీవ‌లే రిలీజై విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. త‌దుప‌రి ఇంద్ర‌గంటి సినిమాపై నాని పూర్తి ఫోక‌స్ పెట్ట‌నున్నాడ‌ని తెలుస్తోంది. అలాగే విక్ర‌మ్.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `గ్యాంగ్ లీడ‌ర్` (వ‌ర్కింగ్ టైటిల్) చిత్రీక‌ర‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఒకేసారి సైమ‌ల్టేనియ‌స్ గా ఈ రెండు సినిమాల‌తో నాని బిజీ అయిపోతున్నారు. ద‌స‌రా కానుక‌గా విక్ర‌మ్ కె సినిమాని.. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో నాని - సుధీర్ బాబు మ‌ల్టీస్టార‌ర్ ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.