టాలీవుడ్ ఇమేజ్ ను దెబ్బ తీసిన RGVని ఏం చేయాలి?

Mon Aug 03 2020 09:00:17 GMT+0530 (IST)

What to do with the RGV that has tarnished the image of Tollywood?

ప్రపంచ సినిమానే తల తిప్పి చూసేంత గొప్ప సినిమాలు టాలీవుడ్ నుంచి వస్తున్నాయి. సంచలనాల `బాహుబలి` టాలీవుడ్ నుంచి వచ్చింది. తెలుగు దర్శకుడు తీసిన అసాధారణ చిత్రంగా రికార్డులకెక్కింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్  చిత్రంగా రికార్డులకెక్కింది. `బాహుబలి 2` ఇండియా కలెక్షన్స్ లో నంబర్ వన్ గా.. వరల్డ్ కలెక్షన్స్ లో దంగల్ తర్వాత నంబర్ 2 గా నిలిచింది. హాలీవుడ్.. బాలీవుడ్ వాళ్లే తలలు తిప్పి చూసేలా చేసింది. వీళ్లంతా మన కథల్ని కాపీ కొట్టాల్సిన లేదా రీమేక్ లు చేయాల్సిన సన్నివేశం ఎదురైంది. ఎన్నో కోణాల్లో టాలీవుడ్ కి మంచి పేరు వచ్చింది.కానీ బాలీవుడ్ నుంచి తరిమేసిన ఆర్జీవీ టాలీవుడ్ పరువు మర్యాదల్ని మంట కలుపుతున్న తీరు చూస్తున్నదే కదా?  ఆయనను టాలీవుడ్ ఎందుకు మోస్తోంది?  బూతు సినిమాలు తీస్తూ రచ్చ చేస్తుంటే ఎన్నాళ్లు ఇలా భరిస్తారు? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సర్వసభ్య సమాజం తల దించుకునేంత చెత్త అడల్ట్ కంటెంట్ సినిమాలు తీస్తూ.. టాలీవుడ్ యూత్ ని తప్పు దోవ పట్టిస్తున్న ఆర్జీవీ ని ఎందుకు బాయ్ కాట్ చేయడం లేదు? అన్న ప్రశ్న పదే పదే తలెత్తుతోంది. హైదరాబాద్ లో వాకింగ్ చేస్తున్న మేధావులు పార్క్ ల దగ్గర గుసగుసలాడుకుంటున్న ఆసక్తికర టాపిక్ ఇది.

ఏదేమైనా మంచికి నేను సైతం అంటూ యువతరానికి మేలు చేసే సినిమాలు తీయాలి కానీ ఐస్ క్రీమ్.. మర్డర్ లాంటి టైటిల్స్ తో యూత్ ను తప్పు దోవ పట్టించడం సరైనదేనా? అందుకే గత కొంతకాలంగా ఆర్జీవీ ని బాయ్ కాట్ చేసేందుకు నిర్మాతల గిల్డ్ సిద్ధమవుతోందన్న అనుమానం పరిశ్రమ పెద్దల్లోనే వ్యక్తమవుతోంది. ఇటీవల ఇండస్ట్రీని అదుపాజ్ఞల్లో పెడుతున్న గిల్డ్ పెద్దలు ఇప్పటికే అడల్ట్ డైరెక్టర్లపై ఓ కన్నేసి ఉంచారని సమాచారం. అసలేం జరగబోతోందో కాస్త ఆగితే కానీ తెలీదు.