ఆది ఏంటీ ఈ సస్పెన్స్.. అసలు విషయం చెప్పవేం?

Thu Jul 16 2020 16:40:02 GMT+0530 (IST)

What is this suspense Adhi ?

లుగు ప్రేక్షకులకు సుపరిచిత దర్శకుడు అయిన రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి. నటుడిగా తెలుగు ప్రేక్షకులకు ఆది ఇప్పటికే సుపరిచితుడు అయ్యాడు. హీరోగా తమిళనాట చిత్రాలు చేస్తూ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ పాత్రలు చేస్తున్నాడు ఆది. గత కొంత కాలంగా ఆది తనతో శమంతకమణి చిత్రంలో నటించిన నిక్కి గర్లానీ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. ఆది కూడా ఎప్పుడు ఆ విషయంలో స్పందించలేదు.తాజాగా ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టిన రోజు వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. ఆ ఫొటోలో సత్యతో పాటు నిక్కి గర్లానీ కూడా ఉంది. ఆది ఫ్యామిలీతో నిక్కి గర్లానీ ఉండటంపై నెటిజన్స్ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. ఆది.. నిక్కి ప్రేమలో ఉన్నారనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏముందని కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం ఈ విషయంలో ఆది క్లారిటీ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికే ఆది.. నిక్కి ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో మీ ఫాదర్ బర్త్ డే పార్టీలో ఆమె ఉండటం దేనికి సంకేతం ఆది అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ఈ సస్పెన్స్ కు తెర దించాలంటూ ఆది ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదికి నిక్కి ప్రేయసినా.. ఫ్యామిలీ ఫ్రెండ్ లేదంటే ఎంతో మంది స్నేహితుల మాదిరిగా ఆమె కేవలం ఒక స్నేహితురాలు మాత్రమేనా అనే విషయాన్ని క్లారిటీగా చెప్పాలంటూ నెటిజన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ విషయమై ఆది పినిశెట్టి స్పందన ఏంటో చూడాలి.