డాషింగ్ డైరెక్టర్ '3 వర్డ్స్' విషయం ఏంటి..??

Wed Jun 09 2021 18:05:11 GMT+0530 (IST)

What is the subject of Dashing Director 3 Words

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనలో మంచి డైలాగ్ రైటర్ మాత్రమే కాదు మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా ఉన్నాడని పూరీ మ్యూజింగ్స్ వినేవారికి అర్ధమవుతుంది. మాములుగా పూరీ జీవిత సత్యాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. లైఫ్ స్టైల్ గురించి ఆయన చెప్పే విషయాలు సోషల్ మీడియా ద్వారా లక్షల మందికి రీచ్ అవుతున్నాయి. కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న పూరీ.. చివరిగా ఇస్మార్ట్ శంకర్ తీసి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగు మాత్రమే కాదని పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నాడు.టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే పూరీ మ్యూజింగ్స్ పేరిట ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మ్యూజింగ్స్ నుండి 'వాట్ 3 వర్డ్స్' అనే అంశం పై పూరీ మాట్లాడిన మాటలు హల్చల్ చేస్తున్నాయి. అయితే 'వాట్ 3 వర్డ్స్' అనేది అందరూ ఏవో ముఖ్యమైన 3 వర్డ్స్ గురించి చెబుతాడేమో అనుకుంటారు. కానీ 'వాట్ 3 వర్డ్స్' అనేది ఓ లొకేషన్ యాప్. ఆ యాప్ గురించి పూరీ జగన్నాథ్ పలు విషయాలు తెలిపి లొకేషన్ చూపించే యాప్స్ లో బెస్ట్ గా చెప్పుకొచ్చాడు.

అయితే ఈ ఆడియోలో ఇద్దరు ఫ్రెండ్స్ ఓ లొకేషన్ పాయింట్ చేరుకునే విషయంలో అడ్రెస్స్ గురించి మాట్లాడుకునే కన్వర్సేషన్ వినిపించాడు. అలా అడ్రస్ విషయంలో ప్రతిరోజూ లక్షల్లో మంది కన్ఫ్యూస్ అవుతుంటారు. ఫ్రెండ్స్ - డెలివరీ బాయ్స్ - స్పెషల్ మీటింగ్స్ ఇలా అన్ని విషయాల్లో మ్యాప్ అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఈ వాట్3వర్డ్స్ అనే యాప్ చాలా బెన్ఫిట్ అని. అలాగే ఈ యాప్ లో ప్రతి అడ్రెస్స్ కు ఓ మూడు పదాల నేమ్ సెట్ అయి ఉంటుందని తెలిపాడు. ఆ యాప్ లో మన అడ్రెస్ కు ఉన్నటువంటి 3వర్డ్స్ ఆధారంగా లొకేషన్ చూపిస్తుందని చెప్పాడు. అలాగే అందరూ ఈ 'వాట్ 3 వర్డ్స్' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అన్నాడు. అలాగే త్వరలోనే ఈ యాప్ తెలుగుతో పాటు సౌత్ భాషల్లో అందుబాటులోకి రానుందని పూరీ చెప్పుకొచ్చాడు.