Begin typing your search above and press return to search.

ఇప్పుడా లేడీ ప్రొడ్యూస‌ర్ ప‌రిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   3 Dec 2022 2:30 AM GMT
ఇప్పుడా లేడీ ప్రొడ్యూస‌ర్ ప‌రిస్థితి ఏంటి?
X
ఇటీవ‌లే పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఓ స్టార్ హీరో సినిమా ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. సినిమాపై క్రూ ఎంతో న‌మ్మ‌కం పెట్టుకుంది. రిలీజ్ కి ముందు ఓ రేంజ్ లో హ‌డావుడి చేసారు. ఇండియా షేక్ అయిపోతుంద‌న్నారు. దేశాన్ని దున్నేస్తామ‌న్నారు. మా అంత‌టి తోపులు..తురుములు లేరు? అన్నంత‌గా బిల్డప్ లు ఇచ్చారు.

కట్ చేస్తే వాళ్ల‌నే ఆచిత్రం తిరిగి షేక్ చేసింది. ఆ దెబ్బ‌కి సౌండ్ లేకుండా పోయింది. షూటింగ్ మ‌ధ్య‌లో ఉన్న సినిమా సైతం ఉన్న‌ప‌ళంగా ఆపేసారు. హీరో వేరే సినిమాతో బిజీ అవ్వ‌గా... ఆ సినిమాని డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు..నిర్మాత‌లు వ‌చ్చిన న‌ష్టాల్ని పూరించే ప‌నిలో ప‌డ్డారు. న‌ష్టాల విష‌యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఎంత‌టి దుమారం రేగించో చెప్పాల్సిన ప‌నిలేదు.

బ‌య్య‌ర్ల‌తో చాలా పెద్ద ఫైటే చేయాల్సి వ‌చ్చింది. అయితే ఈ సినిమా నిర్మాణంలో ఓ లేడీ నిర్మాత కూడా ఉన్నారు. చాలా కాలంగా ఆ స్టార్ డైరెక్ట‌ర్ భాగ‌స్వామ్యంలో సినిమాలు చేస్తున్నారు. కొన్నిసినిమాలు లాభాలు తెస్తే...మ‌రికొన్ని చిత్రాలు న‌ష్ట‌లు మిగిల్చాయి. అన్నింటిని షేర్ చేసుకుంది. కానీ ఇప్పుడా ప‌రిస్థితులు లేవ‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో గుస‌గుస మొద‌లైంది.

న‌ష్టాలు పూడ్చే క్ర‌మంలో ఉన్న‌వి అమ్మేయాల్సి వ‌స్తోందిట‌. ఇప్ప‌టికే కొంత కరిగిపోయింద‌ని స‌మాచారం. ఆ డైరెక్ట‌ర్ పేరిట ప్రాప‌ర్టీస్ ఉన్నాయి కాబ‌ట్టి ఇవ‌న్నీ చేయ‌గ‌ల్గుతున్నాడు. మరి ఆ లేడీ పార్ట‌న‌ర్ ప‌రిస్థితి ఏంటి? అంటే చేతిలో చిల్లి గ‌వ్వ కూడా లేద‌ని గుస గుస వినిపిస్తుంది. ఉన్న‌వ‌న్నీ ఇప్ప‌టికే అమ్మేసిందిట‌. అలాగ‌ని ఆ నిర్మాత‌కిప్పుడు అప్పు పుట్టే ప‌రిస్థితి కూడా లేదుట‌.

ఇంట్లో స‌హకారమా అంటే? చాలా కాలం నుంచి లేనే లేదు. కొన్ని విష‌యాల్లో కుటుంబ స‌భ్యుల‌తో పొర‌పొచ్చాలు రావ‌డంతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇలా ఎటువైపు చూసినా ఆ మ‌హిళా నిర్మాత క‌ష్టాల్లోనే ఉంద‌ని స‌మాచారం. సినిమా కోసం చేసిన అప్పులు తీర్చ‌లేక‌..వ‌డ్డీలు కట్ట‌లేక ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోనే ఉన్నారని టాక్. కానీ ఇవ‌న్నీ వాళ్ల‌కు కొత్తేం కాదు. ఇండ‌స్ర్టీలో ప‌డి లేవ‌డం బాగా అల‌వాటైన వ్యక్తులు. క‌మిట్ మెంట్..డెడికేష‌న్ అనే ప‌దాల‌కు వాళ్లిద్ద‌రు ప‌ర్యాయ ప‌దాలు లాంటివారు. కాబ‌ట్టి తాజా స‌మ‌స్య‌లు ఆ ఇద్ద‌రికీ పెద్ద విష‌య‌మేమి కాద‌న్న‌ది మ‌రికొంత మంది అభిప్రాయం. ఆ ధీమాతోనే చిల్...రిలాక్స్ అంటూ ట ట్విట‌ర్లో కొటేష‌న్లు కొట్టిన‌ట్లు తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.