Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?

By:  Tupaki Desk   |   29 March 2020 12:30 AM GMT
లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?
X
కోవిడ్-19 వ్యాప్తితో దాదాపుగా అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అందరం ఒక్కసారిగా ఇంట్లో కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఈ లాక్ డౌన్ ప్రతి ఒక్క సంస్థపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటలీ.. స్పెయిన్.. యూకె.. యూఎస్ఎ దేశాల్లో. కొన్ని ఇతర ఐరోపా దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

ఈ వ్యాధి ప్రభావం మనదేశంపై కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇది కొత్త మార్పులకు దారితీయవచ్చు. ప్రస్తుతం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేందుకు ప్రజలు భయపడి ఇంట్లోనే అందుబాటులో ఉండే సినిమాలతోనో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు ప్రజలు వెళ్తారేమో కాని యావరేజ్ సినిమాలు అనే పదం ఇకపై కనిపించకపోవచ్చు

సంక్రాంతి సినిమాలు 'అల వైకుంఠపురములో'.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలను ఎగబడి చూసిన ప్రేక్షకులు 'డిస్కో రాజా'.. 'వరల్డ్ ఫేమస్ లవర్' లాంటి సినిమాలను పూర్తిగా రిజెక్ట్ చేసినట్టుగా ఫ్యూచర్ లో సాధారణ సినిమాలను పట్టించుకునే అవకాశం ఉండదు. చిన్న సినిమాల కోసం ప్రేక్షకుల థియేటర్ల మొహం చూస్తారా అన్నది ఒక సందేహం.

ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్ గా నెట్ ఫైల్క్స్.. అమెజాన్ ప్రైమ్.. హాట్ స్టార్.. జీ5.. ఎంఎక్స్ ప్లేయర్.. సన్ నెక్స్ట్ లాంటి ప్లాట్ ఫామ్స్ డైరెక్ట్ రిలీజ్ చేసే అవకాశం తోసిపుచ్చలేం. ఇక ఈ ఓటీటీ ప్లేయర్స్ అందరూ కలిసి సంయుక్తంగా నిర్మాతలకు ఓ ప్యాకేజ్ కింద చెల్లించే ఆకవకాశాలు కూడా ఉన్నాయని ఓ వాదన వినిపిస్తోంది.

నిర్మాతలు కూడా సంప్రదాయ పద్ధతుల్లో థియేటర్లలోనే తమ సినిమాలను విడుదల చెయ్యాలని పట్టుబట్టి కూర్చుంటారని అనుకోలేం. లాక్ డౌన్.. మూడు నాలుగు నెలలు ఆర్ధిక వ్యవస్థ కు ఇబ్బందులు ఏర్పడిన తర్వాత బయట కూడా అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది.

థియేటర్లకు ఓపెన్ చేసిన తర్వాతప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'.. నాని 'V' లాంటి సినిమాల వచ్చే ప్రేక్షకుల సంఖ్య.. కలెక్షన్లను బట్టి నిర్మాతలు ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిలీజ్ కు రెడీ గా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్.. లవ్ స్టోరి.. నిశ్శబ్దం.. రంగ్ దే.. లాంటి సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయి అనేది 'V' కి వచ్చే రెస్పాన్స్ పైనే ఆధారపడి ఉంటుంది.

నిర్మాత కోణంలో ఆలోచిస్తే థియేటర్లో రిలీజ్ అయిందా.. లేక డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిందా అనే అంశం కంటే తమ పెట్టుబడి వెనక్కు వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. థియేట్రికల్ రిలీజ్ లేకపోయినా లేదా నామమాత్రంగా ఉన్నా నిర్మాతలకు తమ పెట్టుబడి తిరిగి వచ్చే పక్షంలో థియేట్రికల్ రిలీజ్ మాత్రమే కావాలని పట్టుబడతారు అని అనుకోలేం. మారిన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన విధానాల్లో మార్పులు రావాలి. అలా కాకుండా పట్టుబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో 'కిస్ ఆఫ్ లవ్'.. 'బ్యాట్ ఫెస్టివల్స్' చేస్తామంటే ఆ వుహానుదేవుడే రక్షించాలి.