Begin typing your search above and press return to search.

దసరా పోటీలో స్వాతిముత్యం పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   6 Oct 2022 5:23 AM GMT
దసరా పోటీలో స్వాతిముత్యం పరిస్థితి ఏంటీ?
X
దసరా కి పెద్ద సినిమాలు రెండు ఒకే రోజు పోటీ పడటమే చాలా పెద్ద విషయం అనుకుంటే ఆ రెండు సినిమాలతో పాటు చిన్న సినిమా అది కూడా కొత్త హీరో సినిమా రావడం అనేది కచ్చితంగా నష్టం కలిగించే విషయం అంటూ విశ్లేషించారు. స్వాతిముత్యం సినిమా దసరాకి విడుదల అవ్వడం అనేది చాలా తప్పుడు నిర్ణయం అంటూ విశ్లేషకులు కూడా కొందరు విశ్లేషించారు.

నిర్మాత నాగవంశీ తో పాటు యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించి విడుదల చేయడం జరిగింది. సినిమాకు పాజిటివ్‌ టాక్ దక్కడంతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.

భారీ బడ్జెట్‌ సినిమా కాదు.. అలాగే వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు. కనుక మినిమం ఆడినా కూడా సినిమా సేఫ్‌ ప్రాజెక్ట్‌ అవుతుంది.

ఇప్పుడు సినిమా కి వస్తున్న టాక్ ని చూస్తూ ఉంటే సేఫ్ ప్రాజెక్ట్‌ అయినట్లే అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గాడ్‌ ఫాదర్‌ సూపర్‌ హిట్ టాక్‌ దక్కించుకున్నా కూడా దసరా పండుగ సెలవులు స్వాతిముత్యం సినిమాకు కలిసి వచ్చే అంశం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్‌ అయ్యే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కనుక మొదటి వారం గడిచేప్పటికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ విశ్లేషకులు గట్టిగానే చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.