అక్కినేని వారసుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేనా...?

Thu Aug 13 2020 17:00:01 GMT+0530 (IST)

Clarity on Akkineni's successor's next project ...?

అక్కినేని వారసుడు అఖిల్ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫస్ట్ సినిమా నుంచి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని అఖిల్ తన శక్తినంతా ధార పోస్తున్నా గాని వర్కౌట్ అవ్వడం లేదు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. ఆకట్టుకునే అందం.. ఆడియన్స్ ని మెప్పించగల అభినయం.. ఇలా అన్నీ ఉన్నా అక్కినేని అఖిల్ కి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. హిట్ టాక్ తెచ్చకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' అనే సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్ ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసాయి. ఈ నేపథ్యంలో అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా లైన్లో పెట్టాడని ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.కాగా అఖిల్ అక్కినేని తదుపరి సినిమాని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేయబోతున్నాడని.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్టుగా అఖిల్ నెక్స్ట్ సినిమా విషయంలో మరో రూమర్ స్ప్రెడ్ అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ తేజ ఇటీవల అఖిల్ కి ఓ స్టోరీ నేరేట్ చేశాడట. అంతేకాకుండా ఈ స్టోరీ లైన్ నాగార్జున కూడా విని ఇంప్రెస్ అయి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. ప్రస్తుతం కరోనా కి చికిత్స తీసుకుంటున్న తేజ కంప్లీట్ స్క్రిప్ట్ తో త్వరలోనే అక్కినేని కాంపౌడ్ లో అడుగుపెడతాడని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో రోజుకొక న్యూస్ వస్తూనే ఉంది. మరి అక్కినేని వారసుడు సురేందర్ రెడ్డితో జత కడతాడా లేదా సీనియర్ డైరెక్టర్ తేజతో ముందుకు వెళ్తాడా అనే దానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.