నెక్స్ట్ వీక్ మూవీస్ పరిస్థితి ఏంటీ?

Fri Aug 05 2022 22:00:01 GMT+0530 (IST)

What is the condition of next week movies

జూలై నెలలో విడుదైన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ విడుదలై డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.జనం థియేటర్లకు రావడం లేదని ఓటీటీ టికెట్ రేట్లు బిడ్జెట్ పెరిగిపోయిందంటూ నిర్మాతలు షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు 5న థియేటర్లలోకి వచ్చిన రెండు సినిమాలు బింబిసార సీతారామం తొలి షో నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ లో కొత్త ఆశల్ని రేకెత్తించాయి.

జనాలు మునుపటిలా మళ్లీ థియేటర్లకు వస్తారా?  రారా? అని భయాందోళల నేపథ్యంలో విడుదలైన ఈ రెండు సినిమాలు రిజల్ట్ ఎలా వుంటుందా? అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఊహించిన విధంగానే నందమూరి కల్యాణ్ రామ్ `బింబిసార` దుల్కర్ సల్మాన్ నటించిన `సీతా రామం` మంచి విజయాన్ని సాధించి భారీ ఊరట నిచ్చాయి. విచిత్రం ఏంటంటే ఈ రెండు డిఫరెంట్ జోనర్ లకు చెందిన సినిమాలు.

కల్యాణ్ రామ్ నటించిన `బింబిసార` పక్కా మాస్ ఎంటర్ టైనర్ టైమ్ ట్రావెల్ కథతో తెరకెక్కిన మూవీ. కానీ `సీతా రామం` అలా కాతు కంప్లీట్ క్లాస్ బొమ్మ. పీరియాడిక్ నేపథ్యంలో సాగే ఫిక్షనల్ రొమాంటిక్ లవ్ స్టోరీ.

దీంతో ఈ రెండు సినిమాలు ఒకే సారి ఆడియన్స్ నచ్చేశాయి. సక్సెస్ అనిపించుకున్నాయి. దీంతో నెక్స్ట్ వీక్ రానున్న సినిమాల పరిస్థితి ఏంటీ అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. శుక్రవారం విడుదలైన రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడం హిట్ టాక్ తెచ్చుకోవడం తెలిసిందే.

అయితే ఈ రెండు సినిమాల హడావిడీ ఈ వారం అంతా వుంటుంది. మరి నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. వచ్చే వారం ఆగస్టు 12న  నితిన్ నటించిన `మాచర్ల నియోజక వర్గం` విడుదల కాబోతోంది. ఈ మూవీ తరువాత ఆగస్టు 13న నిఖిల్ నటించిన `కార్తికేయ 2` రాబోతోంది. బింబిసార సీతారామం జోరు కొనసాగేలా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల కోసం వచ్చే వారం విడుదల కానున్న రెండు సినిమాల్లో ఎవరు వెనక్కి వెళతారు? అని చెప్పుకుంటున్నారు. నితిన్ వెనక్కి వెళతాడా?  లే క మరో సారి నిఖిల్ నే వెక్కి వెళ్లమంటారా అన్నది వేచి చూడాల్సిందే.