Begin typing your search above and press return to search.

ఓటీటీ వార్ లో తెలుగు వె‌ర్ష‌న్ ది బెస్ట్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   7 July 2020 3:45 AM GMT
ఓటీటీ వార్ లో తెలుగు వె‌ర్ష‌న్ ది బెస్ట్ ఎవ‌రు?
X
ప్ర‌స్తుతం ఓటీటీ వేదిక‌ల జూమింగ్ చూస్తున్నదే. మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ స‌మ‌యంలో అమెజాన్- నెట్ ఫ్లిక్స్- జీ5- డిస్నీ హాట్ స్టార్ లాంటి దిగ్గ‌జ సంస్థ‌లు భారీగా స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను బుట్ట‌లో వేశాయి. అయితే వీళ్ల‌లో తెలుగు ఆడియెన్ కి బాగా క‌నెక్ట‌యిన సంస్థ‌లు ఏవీ? అంటే అమెజాన్- జీ5 అనే చెప్పాలి. హాట్ స్టార్ ఆ త‌ర్వాతి స్థానంలో ఉంది. అలాగే నెట్ ఫ్లిక్స్ జాతీయ స్థాయిలో భారీగా ఫాలోవ‌ర్స్ ని తెచ్చుకున్నా.. అందులో తెలుగైజ్ చేసిన కంటెంట్ స‌రిప‌డినంత లేక‌పోవ‌డం మైన‌స్ అనే చెప్పాలి.

అమెజాన్ లో హిందీ ఇంగ్లీష్ వెర్ష‌న్ల‌తో పాటు తెలుగు వ‌ర్ష‌న్ అద‌నంగా అందుబాటులో ఉంటోంది. దీనివ‌ల్ల ఎక్కువ కంటెంట్ జ‌నాద‌ర‌ణ పొందుతోంది. ముఖ్యంగా తెలుగు లోగిళ్ల‌లో అమెజాన్ ప్రైమ్ పాపులారిటీ పెరుగుతోంద‌నే చెప్పాలి. ఇక ఆహా లాంటి తెలుగు ఓటీటీ ఉన్నా అందులో ఇంకా పెద్ద స్థాయిలో కంటెంట్ ని పుల్ చేయాల్సి ఉంటుంది. అందుకు ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది.

అమెజాన్ ప్రైమ్ .. జీ5లో కొన్ని వెబ్ సిరీస్ లు.. హిందీ.. ఇంగ్లీష్ చిత్రాల‌ తెలుగు డబ్బింగుల‌తో సౌల‌భ్యం ఉంది. కానీ నెట్ ఫ్లిక్స్ ఇంకా తెలుగు మార్కెట్ విష‌యంలో సీరియ‌స్ గా ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. కేవ‌లం తెలుగు స్ట్రెయిట్ సినిమాల‌తోనే స‌రిపుచ్చుతోంది త‌ప్ప‌.. ఇత‌ర భాష‌ల చిత్రాల్ని తెలుగ‌నువాదం చేసి ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డంతో చాలా వ‌ర‌కూ వినోదాన్ని ఈ యాప్ లో మిస్స‌వుతున్నారు. ఒక‌వేళ నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ లు.. సినిమాలు అన్నిటినీ తెలుగైజ్ చేస్తే రేసులో టాప్ పొజిష‌న్ కి చేరుకునే వీలుంటుంద‌ని భావిస్తున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ తెలుగు మార్కెట్ పై పూర్తిగా దృష్టి సారించిన‌ట్టు క‌నిపించ‌డం లేదు.