Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' తర్వాత ఆమె పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   15 May 2022 1:30 AM GMT
ఎఫ్ 3 తర్వాత ఆమె పరిస్థితి ఏంటీ?
X
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్‌. తెలుగు లో మొదటి సినిమా తోనే జూనియర్‌ మిల్కీ బ్యూటీ అంటూ పేరు దక్కించుకున్న మెహ్రీన్‌ కు పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు రాకున్నా కూడా ఒక మోస్తరుగా సక్సెస్ లు దక్కడంతో మీడియం రేంజ్... యంగ్‌ హీరోలతో నటించే అవకాశాలు దక్కిన విషయం తెల్సిందే.

తెలుగు తో పాటు తమిళం మరియు పంజాబీ కన్నడం లో కూడా అప్పుడప్పుడు నటిస్తున్న ఈ అమ్మడు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ మధ్య పెళ్లికి సిద్దం అయ్యి నిశ్చితార్థం వరకు కూడా వెళ్లింది. కాని కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. మెహ్రీన్‌ పెళ్ల క్యాన్సిల్‌ అవ్వడంతో అభిమానులు ఆమె మరిన్ని సినిమాల్లో నటిస్తుందని ఒకింత ఆనందం వ్యక్తం చేశారు అనడంలో సందేహం లేదు.

కెరీర్‌ పరంగా మెల్ల మెల్లగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళ్తుంది కాని ఇప్పటి వరకు ఒక స్టార్‌ డమ్‌ అనేది మెహ్రీన్ కు దక్కలేదు. ఈ సినిమా తర్వాత.. లేదా ఆ సినిమా తర్వాత స్టార్‌ డమ్ వస్తుందని భావించింది. కాని ఆమె సినిమా సినిమా కు అలాగే ఉంటుంది తప్ప మార్పు లేదు. ఎఫ్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా స్టార్‌ హీరోల నుండి పిలుపు మాత్రం రాలేదు.

ఇప్పుడు ఎఫ్‌ 3 సినిమా తో మెహ్రీన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ నటించిన విషయం తెల్సిందే. సినిమా ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. మంచి అంచనాలున్న ఎఫ్‌ 3 సినిమా విజయం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

ఎఫ్‌ 3 సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని మెహ్రీన్‌ ఎదురు చూస్తుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో పాటు ఆమె పాత్రకు కూడా మంచి పేరు వస్తే మరికొంత కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం ఉంటుందని మెహ్రీన్ ఆశ పడుతుంది. ఎఫ్ 3 సినిమా కాకుండా టాలీవుడ్‌ లో మరే సినిమాను ఈ అమ్మడు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఒక కన్నడ సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

ఎఫ్‌ 3 కి ముందు తెలుగు లో ఈమె చేసిన సినిమాలు నిరాశ పరిచాయి. అశ్వథామ.. మంచి రోజులు వచ్చాయి సినిమాలు మెహ్రీన్ కు నిరాశను మిగిల్చాయి. దాంతో ఎఫ్‌ 3 సినిమా కెరీర్‌ లో మరో రెండు మూడు సంవత్సరాలు కొనసాగేలా మంచి పేరు దక్కించుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.