వరంగల్ లో వర్మ ఏం ప్లాన్ చేస్తున్నాడో..?

Thu Sep 23 2021 12:03:41 GMT+0530 (IST)

What is Varma planning in Warangal

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతోనే కాకుండా.. తన వ్యవహార శైలితో కూడా సంచలనం సృష్టిస్తుంటాడు. వాస్తవ సంఘటల ఆధారంగా సినిమాలు తీయడంలో వర్మ సిద్ధహస్తుడనే విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా దాన్ని వెండితెర మీదకు తీసుకొచ్చి రచ్చ చేయడం ఆర్జీవీ కి అలవాటైన పని. సినీ రాజకీయ ప్రముఖుల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ దగ్గర నుంచి.. శృంగార తారల లైఫ్ స్టోరీలు - గ్యాంగ్ స్టర్ జీవితాలు - దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటనలు వరకూ.. అన్నీ ఆర్జీవీ కి కథా వస్తువులే. ఈ క్రమంలో చెలరేగే వివాదాలను చూసి ఎంజాయ్ చేయడం వర్మ నైజం.గతేడాది కరోనా సమయంలో వరుసగా సినిమాలు తీసి ఓటీటీలో రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. గత కొంత కాలంగా సినిమాల మీద కంటే బోల్డ్ ఇంటర్వ్యూస్ వంటి మిగతా విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వర్మ వరంగల్ లో సీక్రెట్ గా పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని ఎల్బీ కాలేజీలో సిబ్బందిని అక్కడి అధ్యాపకులను కలిసి రాంగోపాల్ వర్మ ఏదో ఇన్ఫర్మేషన్ లాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్జీవీ మళ్ళీ ఏదో సెన్సేషనల్ సబ్జెక్ట్ ని తెర మీదకు తీసుకురాబోతున్నారని టాక్ మొదలైంది.

ఇప్పటికే పలు వివాదాస్పద బయోపిక్స్ ని తెరకెక్కించిన వర్మ.. వరంగల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కొండా సురేఖ-మురళి ల బయోపిక్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాలేజీకి వెళ్లి వారి విద్యాభ్యాసం వివరాలు సేకరిస్తున్నారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ బయోపిక్ ఎలాంటి వివాదాలకు తెరతీస్తుందో చూడలి. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొన్ని సినిమాలు స్పార్క్ ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో 'కడప' అనే ఓ వెబ్ సిరీస్ కూడా రానుంది.