ప్రభాస్-మారుతి ఏంటి గందరగోళం?

Tue Oct 04 2022 13:00:01 GMT+0530 (India Standard Time)

What is Prabhas-Maruti's confusion?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'రాజా డీలక్స్' టైటిల్  తో సినిమా సెట్స్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభాస్ లేకుండానే మారుతి అప్పుడే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కథలో మార్పులు..చేర్పులు సూచించినట్లు కొత్త విషయం తెరపైకి వస్తుంది.ఫస్ట్ షెడ్యూల్ రషెస్ చూసిన ప్రభాస్ మంత్రముగ్దుడైనా?  కథ పరంగా మార్పులు అవసరమని మారుతికి సూచించినట్లు సమాచారం. వజ్రాల  దొంగ నేపథ్యంలో సాగేలా కథని మౌల్డ్ చేసి ఆ పాయిట్ కి యాక్షన్ అద్దితే బాగుంటుందని డార్లింగ్ సూచించారుట. దానికి మారుతి కూడా ఒకే  చెప్పాడని..తన టీమ్ కూడా మార్పులు మొదలు పెట్టినట్లు కొత్త ప్రచారం సాగుతోంది.

మరి ఇందులో నిజమెంత?  అన్నది తెలియదు గానీ..నెట్టింట మాత్రం ఈ విషయం హాట్ టాపిక్  గా మారింది. ఈ సినిమా గురించి ఇంతవరకూ ప్రభాస్ గానీ..మారుతిగానీ అధికారికంగా ఏ విషయం చెప్పడం లేదు. ఈ సినిమా కథ విషయంలో ఇప్పటికే రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఇది తాత-మనవల కథ అని..రాజా డీలక్స్  అనే థియేటర్ చుట్టూ ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమని అన్నారు.

అటు పై ఇదొక కామెడీ హారర్  థ్రిల్లర్ అని...'ప్రేమ కథా చిత్రమ్' ని మెచ్చి డార్లింగ్ కల్పించిన అవకాశం కాబట్టి అదే పాయింట్ ని బేస్  గా తీసుకుని మారుతి మలుస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇలా కథ విషయంలో రకరకాల అపోహలు  తెరపైకి వస్తున్నాయి. ఏది నిజం? అన్నది క్లారిటీ లేదు. మరోవైపు మారుతితో ప్రభాస్ సినిమా చేయడంపైనా నెగిటివిటీ సైతం జోరుగానే  స్ర్పెడ్ అవుతోంది.

ఈ కాంబినేషన్ తెరపైకి రాగానే డార్లింగ్ రిస్క్  తీసుకుటున్నాడా? అని విమర్శలు వినిపించాయి. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి మారుతితో సినిమా చేయాల్సినంత అవసరం ఏముందంటూ ? అభిమానులు సైతం సందేహం వ్యక్తం చేసారు.

ఇలా ఆ కాంబోపై తొలి నుంచి స్పష్టత లొపిస్తుంది. కథపై నెట్టింట జరుగుతోన్న ప్రచారం చూస్తుంటే?  అసలు సినిమా నిజంగా మొదలైందా?  అన్న సందేహాలు బలంగా మొదలవుతున్నాయి. మరి దీని వెనుక అసలేం జరగుతోంది? అన్నది తెలియాలంటే అలసు వ్యక్తులు లైన్ లోకి  రావాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.