Begin typing your search above and press return to search.

ఒక్కో బ్రాండ్ కి మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

By:  Tupaki Desk   |   25 Oct 2020 5:30 AM GMT
ఒక్కో బ్రాండ్ కి మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?
X
సెల‌బ్రిటీల‌కు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ రెవెన్యూ అద‌న‌పు భ‌రోసా అన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల్లో అంతో ఇంతో పేరుంటే చాలు వారితో యాడ్ ఏజెన్సీలు.. ప్ర‌ముఖ బ్రాండింగ్ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. భారీ గా డీల్స్ కుదుర్చుకుని పారితోషికాలు అంద‌జేస్తున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ బిజినెస్ లాభ‌సాటిగా వుండ‌టంతో చిన్న హీరోల‌ నుంచి టాప్ రేంజ్ లో వున్న హీరోల వ‌ర‌కు భారీగా డిమాండ్ చేస్తున్నారు. చిన్న హీరోలే ఓ రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తుంటే స్టార్ హీరోల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్పుడున్న అర‌డ‌జ‌ను హీరోల్లో అంద‌రూ భారీగానే లాగించేస్తున్నారు.

ఈ జాబితాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ముందు వ‌రుస‌లో వున్నారు. ఈ మ‌ధ్య వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటూ దూసుకుపోతున్న ఆయ‌న క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ విష‌యంలో టాలీవుడ్ హీరోల్లో టాప్ వ‌న్ పొజీష‌న్ లో వున్నారు. ఓ ర‌కంగా చెప్పాలంటే బాలీవుడ్ హీరోల‌తో బ్రాండ్ ల విష‌యంలో పోటీప‌డుతున్నారు. సినిమాల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ రూపంలో మ‌హేష్ భారీగానే అందుకుంటున్నారు. క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కి మ‌హేష్ అందుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? 5 నుంచి 10 కోట్లు.

థ‌మ్స్ అప్,... సంతూర్‌,... బైజూస్,... డెన్వ‌ర్ వంటి బ్రాండ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ ‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌హేష్ ఏడాదికి గానూ దాదాపు 5 నుంచి 10 కోట్లు తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. ఈ మ‌ధ్య ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్ కార్ట్ కి బ్రాండింగ్ చేస్తున్నారు. దీనికి కూడా మ‌హేష్ భారీగానే డిమాండ్ చేస్తున్నార‌ట‌. అంతే మ‌రి దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం ఇంటే ఇదే మ‌రి స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న‌ప్పుడే అందినంత దండుకోవాలంటారు. మ‌హేష్ అదే చేస్తున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌.