Begin typing your search above and press return to search.

పవన్‌ ‘విరూపాక్ష’లో జాక్వెలిన్‌ ఏంటంటే..!

By:  Tupaki Desk   |   12 July 2020 8:10 AM GMT
పవన్‌ ‘విరూపాక్ష’లో జాక్వెలిన్‌ ఏంటంటే..!
X
పవన్‌ 27వ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. అన్ని అనుకున్నట్లుగా సాగి ఈ కరోనా లాక్‌ డౌన్‌ లేకుండా ఉంటే ఇప్పటికే సినిమా సగం వరకు పూర్తి అయ్యేదేమో. మెఘలుల కాలం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతున్న విషయం తెల్సిందే. పవన్‌ చేయబోతున్న మొదటి చారిత్రాత్మక నేపథ్యం సినిమా అవ్వడంతో ఫ్యాన్స్‌ అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్‌ ను కూడా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో పవన్‌ దొంగగా కనిపించబోతున్నాడు. మొఘలుల కాలంలో అత్యంత ఖరీదైన ఒక నిధిని దొంగలించేందుకు పవన్‌ ప్రయత్నించే కథతో ఈ సినిమా రూపొందబోతుందట. ఈ చిత్రంలో బాలీవుడ్‌ హాటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ను కూడా నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రిష్‌ కు బాలీవుడ్‌ లో మంచి పేరు ఉంది. అందుకే జాక్వెలిన్‌ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట. ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

జాక్వెలిన్‌ ఈ సినిమాలో నటిస్తే సినిమాకు జాతీయ స్థాయిలో క్రేజ్‌ వచ్చే అవకాశం ఉందని కూడా క్రిష్‌ భావిస్తున్నాడట. ఈ చిత్రంలోని కీలకమైన యువరాణి పాత్రకు గాను ఆమెను నటింపజేస్తున్నాడట. అయితే ఆమె పాత్ర సినిమా సెకండ్‌ హాఫ్‌ లో మాత్రమే కనిపిస్తుందని టాక్‌. ఆమె పాత్ర చనిపోతుందని కూడా సమాచారం అందుతోంది. అసలు విషయం త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.