ఈ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ కు ఏమైంది?

Wed Jul 21 2021 14:09:16 GMT+0530 (IST)

What happened to this Most Happening Producer?

టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా కూడా ఈమద్య కాలంలో ఎక్కువగా పెన్ స్టూడియో పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పెన్ స్టూడియో బ్యానర్ లో చత్రపతి సినిమా హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక శంకర్ దర్శకత్వంలో తమిళ అపరిచితుడు హిందీలో రీమేక్ అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి. హిందీలో మూడు నాలుగు సినిమాలు నిర్మాణం దశలో ఉన్నాయి. నిర్మాణంలోనే కాకుండా ఈ సంస్థ డిస్ట్రబ్యూషన్ లో కూడా దూసుకు పోతుంది.దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ను పెన్ ఇండియా వారు ఉత్తరాదిన విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. అందుకోసం పెన్ ఇండియా సంస్థ దానయ్యతో అత్యంత భారీ మొత్తంకు ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇంత భారీ ఒప్పందం  గతంలో ఏ సౌత్ ఇండియన్ మూవీకి కూడా ఉత్తరాదిన దక్కలేదు అనేది టాక్. పెన్ స్టూడియో లో వరుసగా పెద్ద సినిమాలను నిర్మించడంతో పాటు వరుసగా పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రస్తుతం ఇండియన్ సినిమా లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ గా జయంతిలాల్ గడ పేరు దక్కించుకున్నాడు. అలాంటి జయంతి లాల్ ఆరోగ్యం బాగాలేదని.. ఆయన ఆఫీస్ లో ఉండగా కుప్పకూలిపోయాడు అంటూ వార్తలు వచ్చాయి.

జాతీయ మీడియాలో ఈ వార్తలు ప్రముఖంగా రావడంతో ఆయన తనయుడు దవల్ గడ స్పందించారు. నాన్న ఆఫీస్ లో కుప్పకూలిపోయారు అనేది నిజం కాదు. కాని నాన్న అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. ముంబయిలోని ఒక ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యవంతుడిగా మారుతున్నారంటూ దవల్ గడ పేర్కొన్నారు. నాన్న కు చికిత్స అందించిన డాక్టర్లకు దవల్ గడ కృతజ్ఞతలు చెప్పారు. మొత్తానికి ఇండియాస్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ జయంతిలాల్ ఆరోగ్యం విషయంలో వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలోనే మళ్లీ సినిమాలతో బిజీ అవుతారని ఆయన తనయుడి ద్వారా క్లారిటీ వచ్చింది.