ఈ అక్కినేని హీరోకు దారేది..?

Mon May 03 2021 14:03:37 GMT+0530 (IST)

What happened to this Akkineni hero ..?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి మేకర్స్ సినిమా షూటింగ్ లొకేషన్స్ కోసం వివిధ దేశాలను పరిశీలించారు కానీ ఏది సాధ్యం కాలేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుండటం వలన ఇండియా నుండి అన్ని దేశాలకు విమానయాణం బంద్ అయిపోయింది. ఆయా దేశాలు ప్రస్తుతం ఇండియా నుండి ఫ్లైట్ సర్వీస్ నిలిపేసాయి. అందుకే మళ్లీ ఆలోచనలో పడ్డారు మేకర్స్.ఈ థాంక్యూ సినిమాను ఇటీవలే వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా విషయం డైరెక్టర్ విక్రమ్ ప్రణాళికలు అన్నికూడా ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే ఓవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మరోవైపు ఈ చిత్రబృందం షూటింగ్ కోసం ఉబలాటపడటం పై సోషల్ మీడియాలో వ్యతిరేకత వినిపిస్తుంది. ప్రస్తుతం బడా స్టార్స్ కూడా షూటింగ్స్ ఆపేసి ఇళ్లకు చేరుకున్నారు. అలాగే థియేటర్స్ కూడా ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. నిజానికి విదేశాలకు వెళ్ళడానికి ఆస్కారం లేదు అలాగే ఇండియాలోనే షూట్ చేయడానికి అవకాశం లేదు. అంతటా కేవలం కరోనా మరణాలు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ ఎలాగైనా థాంక్యూ మూవీ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో డైరెక్టర్ - నిర్మాత వేరే దేశాలను సంప్రదిస్తున్నారట.

మొత్తానికి థాంక్యూ సినిమాకు మొదటినుండి అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. అయితే నాగచైతన్య ఆల్రెడీ లవ్ స్టోరీ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసాడు. కానీ గతేడాది కాలంగా లవ్ స్టోరీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూనే ఉంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయిపల్లవి నటించింది. చూడాలి మరి థాంక్యూ మూవీ షూటింగ్ కి దారేది.. అంటూ మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి త్వరలో గుడ్ న్యూస్ చెబుతారేమో!