కమల్ ఆరోగ్యంపై రజనీ ఏమంటున్నారు?

Thu Nov 25 2021 14:34:58 GMT+0530 (IST)

What does Rajini say about Kamal health

విశ్వనటుడు కమల్ హాసన్ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటవలే అమెరికా ట్రిప్ ముగించుకుని ఇండియాకి చేరుకున్నారు. అనంతరం దగ్గు..జ్వరం..తలనొప్పి మొదలవ్వడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.దీంతో ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. వైద్యులు సూచనలు..సలహాలతో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని కమల్ ట్విటర్ వేదికగా అభిమానులకు తెలిపారు.

దీంతో అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. అమెరికాలో ఇప్పటికే సెకెండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అభిమానులు కంగారుకు గురయ్యారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ఆరోగ్యం బాగనే ఉందని కమల్ కుమార్తె శృతిహాసన్ తెలిపింది.

దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కమల్ కోలుకోవాలని దేవుళ్లను ప్రార్ధించిన అభిమానులు..ప్రేక్షకులకు శ్రతి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా కమల్ ఆరోగ్యంపై ఆయన స్నేహితుడు..సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆరా తీసారు. బుధవారం రజనీకాంత్ నేరుగా కమల్ కి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు.

వీలైనంత త్వరగా మహమ్మారి నుంచి కోలుకోవాలని రజనీ కోరుకున్నారు. ఇంకా కోలీవుడ్ నుంచి ప్రభు..శరత్ కుమార్..విష్ణు విశాల్..శివకార్తికేయన్..ఎస్పీ ముత్తురామన్.. లోకేష్ కనగరాజ్.. పహద్ పాసిల్.. అట్లీ.. ఇషారీ గణేష్..విక్రమ్ ప్రభు పలువురు దర్శక..నిర్మాతలు ఆరాలు తీసారు.

కోలీవుడ్ లో రజనీ-కమల్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్ధాలుగా ఇద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. రాజకీయ సిద్ధాంతాల పరంగా వేర్వేరు అయినా..ఇద్దరు సపరేట్ పార్టీలు పెట్టినా స్నేహితులుగా మాత్రం విడిపోలేదు.

రాజకీయానికి...స్నేహానికి ముడిపెట్టకుండా కొనసాగుతోన్న ప్రెండ్ షిప్ వాళ్లిద్దరిది. కమల్ హాసన్ ఇటీవల బిగ్ బాస్ -తమిళ సీజన్ కి హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూనే నటనలోనూ కొనసాగుతున్నారు. భారతీయుడు 2 వివాదంలో శంకర్- లైకా మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారని కథనాలొచ్చాయి.