Begin typing your search above and press return to search.

మ‌లైకా వీపు సొగసుపై కుర్ర హీరో ఏమ‌న్నారు?

By:  Tupaki Desk   |   24 Jan 2021 1:30 PM GMT
మ‌లైకా వీపు సొగసుపై కుర్ర హీరో ఏమ‌న్నారు?
X
మలైకా అరోరా - అర్జున్ కపూర్ బంధం అన్ని వేళలా బ‌హిరంగ‌మే. ఏనాడూ ఈ జంట దాచ‌నేలేదు. క‌లిసే మెగా-ఈవెంట్ల‌‌కు హాజరుకావడం నుండి,.. సెలవుల్లో వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం వరకు.. ఈ హాట్ పెయిర్ ఇతర జంట‌ల‌కు ప్రధాన లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇటీవ‌లే మ‌లైకా- అర్జున్ జోడీ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్ని గోవా బీచ్ లోని ఓ విల్లాలో జ‌రుపుకున్నారు. ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాతా నిరంత‌రం ఏదో ఒక వేడెక్కించే ఫోటోని మ‌లైకా షేర్ చేస్తున్నారు.

తాజాగా మ‌రో స్పెష‌ల్ ఫోటోని మ‌లైకం షేర్ చేయ‌గా దానిపై యూత్ కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు. వీపు చూడు వీపందం చూడు! అంటూ మ‌లైకా వీపుపై హాట్ కామెంట్ల‌తో హీటెక్కిస్తున్నారు. సూర్య కాంతిలో బ‌ర్న్ అవుతున్నాను! అన్న క్యాప్ష‌న్ తో మ‌లైకా ఈ ఫోటోని షేర్ చేయ‌గా ..
సింపుల్ ఫ్రాకులో త‌న‌ వీపు భాగం సూర్య కాంతి మెరుపుల‌తో వేడెక్కించింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా దూసుకెళుతోంది. దీనికి యూత్ కామెంట్లు వేడెక్కిస్తున్నాయి. ఇంత‌కీ ప్రియుడు దీనిపై ఏమ‌ని కామెంట్ చేశారు? అన్న‌దానిపైనా ఫ్యాన్స్ ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి మ‌లైకా నుంచి స‌మాధానం రావాల్సి ఉంది.

గత కొద్ది రోజులుగా అర్జున్ `భూత్ పోలీస్` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్- యామి గౌతమ్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు అర్జున్- మ‌లైకా జంట‌ వరుణ్ ధావన్ - నటాషా దలాల్ వివాహానికి కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది.