Begin typing your search above and press return to search.

'కొండపొలం' తో వైష్ణవ్ కు దక్కింది ఏంటీ?

By:  Tupaki Desk   |   13 Oct 2021 6:36 AM GMT
కొండపొలం తో వైష్ణవ్ కు దక్కింది ఏంటీ?
X
మెగా హీరోల్లో ఏ హీరోకు దక్కని రికార్డు.. ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియన్‌ హీరోకు దక్కని రికార్డు అనూహ్యంగా మెగా వైష్ణవ్ తేజ్ కు దక్కింది. మొదటి సినిమా తోనే వంద కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక హీరోగా వైష్ణవ్‌ రికార్డు సాధించాడు. ఉప్పెన సినిమాతో వైష్ణవ్‌ తేజ్ ఇచ్చిన ఎంట్రీ ఏ హీరోకు దక్కలేదు అనడంలో సందేహం లేదు. ఉప్పెన సినిమాలో వైష్ణవ్ చేసిన పాత్ర మరియు కథలో ఉన్న ట్విస్ట్‌ కు వైష్ణవ్ ఒప్పుకోవడం కూడా చాలా పెద్ద విషయం. ఉప్పెన సినిమా కు నటుడిగా మంచి పేరును దక్కించుకోవడంతో పాటు వంద కోట్ల వసూళ్లను కూడా వైష్ణవ్ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే ఆ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న వైష్ణవ్‌ కు రెండవ సినిమా అంతకు మించి ఉండాలని అభిమానులు ఆశించారు. కాని వ్యూహమో లేదా మరేంటో కాని వైష్ణవ్ తేజ్ రెండవ సినిమాగా కొండపొలం అనే ఒక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కొండపొలం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విభిన్నమైన సినిమా అంటూ విమర్శకుల నుండి టాక్ దక్కించుకోవడంతో పాటు.. ఒక మంచి మెసేజ్ ఉందంటూ కూడా కామెంట్స్ ను దక్కించుకుంది. కాని వసూళ్ల విషయంలో మాత్రం నిరాశ పర్చింది. ఒక చిన్న బడ్జెట్ మూవీగా రూపొందిన కొండ పొలం సినిమాకు వచ్చిన వసూళ్లు సంతృప్తికరంగానే ఉండవచ్చు. కాని ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ వంద కోట్ల సినిమా తర్వాత వైష్ణవ్‌ తేజ్ నుండి ఆ స్థాయి కమర్షియల్‌ మూవీని ఆశించిన మెగా ఫ్యాన్స్ కు మాత్రం తీవ్ర నిరాశ తప్పలేదు. మొదటి సినిమాకు వంద కోట్ల వసూళ్లు దక్కించుకున్న వైష్ణవ్ తేజ్‌ కొండపొలం సినిమాకు కనీసం 10 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక పోవడం దారుణం. క్రిష్‌ ఈ సినిమాను వైష్ణవ్‌ తేజ్ తో చేయడం చాలా పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక చిన్న హీరోతో ఈ సినిమాను చేయాల్సింది వంద కోట్ల మెగా హీరోతో ఇలాంటి సినిమాను చేసేందుకు క్రిష్ సిద్దమవ్వడం విడ్డూరంగా ఉందని కొందరు అంటున్నారు. కొందరు మాత్రం నటుడిగా ఉప్పెన స్థాయి సినిమాగా కొండపొలం నిలుస్తుందని అంటున్నారు. నటుడు అన్నప్పుడు అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే కమర్షియల్‌ హీరోగా గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉంటుంది. అందుకే వైష్ణవ్ తేజ్ అన్ని రకాల పాత్రలు చేసే ఉద్దేశ్యంతో రెండవ సినిమాతోనే ప్రయోగాన్ని చేయడం అభినందనీయం అంటున్నారు. కొండ పొలం సినిమా లో వైష్ణవ్‌ తేజ్ చాలా మెచ్యూర్డ్‌ గా నటించిన తీరు.. అతడు పాత్ర కోసం తనను తాను మల్చుకున్న తీరు అభినందనీయం అంటున్నారు. ప్రస్తుతం గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్‌ మూడవ సినిమా తెరకెక్కుతుంది. అర్జున్‌ రెడ్డి సహాయ దర్శకుడు అయిన గిరీశయ్య తమిళంలో అర్జున్‌ రెడ్డిని రీమేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వైష్ణవ్ కు మూడవ సినిమా నటుడిగా పేరు తెచ్చి పెడుతుందా.. లేదంటే కమర్షియల్‌ గా కూడా హిట్ ను అందిస్తుందా అనేది చూడాలి.