సాయి పల్లవికి ఇంత కంటే గొప్ప ప్రశంస ఉండదేమో

Sun Jan 30 2022 05:00:01 GMT+0530 (IST)

What could be a greater compliment to Sai Pallavi than this

ఈమద్య కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయి పల్లవి. ఈమె హీరోయిన్ గా సినిమా సినిమాకు స్థాయి పెంచుకుంటూ పోతుంది. అందాల వింధు చేయకుండా.. ఏమాత్రం స్కిన్ షో చేయకుండా కేవలం ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్న సాయి పల్లవి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ అండ్ క్రేజీ అండ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఏ సినిమా చేసినా కూడా సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆమె పాత్ర మరియు ఆమె సక్సెస్ అవుతున్నాయి. తాజాగా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ లో కూడా సాయి పల్లవి నటించింది. సినిమాలో సాయి పల్లవి కనిపించేది సెకండ్ హాఫ్ లోనే... స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువ అయినా కూడా సాయి పల్లవి పూర్తిగా షో నడిపించింది. సాయి పల్లవి వల్లే సినిమాకు ఆ స్థాయి క్రేజ్ వచ్చింది అనడంలో సందేహం లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా సీనియర్ హీరోయిన్ మధుబాల చేసిన వ్యాఖ్యలు సాయి పల్లవి స్థాయిని మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఎంతో మంది సాయి పల్లవి నటన గురించి ప్రశంసించారు. కాని మధుబాల చేసిన వ్యాఖ్యలు సాయి పల్లవి కెరీర్ లోనే బెస్ట్ ప్రశంస అయ్యి ఉంటుంది అనడంలో సందేహం లేదు. మధుబాల ఒక వీడియోను షేర్ చేశారు.

అందులో శ్యామ్ సింగ రాయ్ పై ప్రశంసలు కురిపిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ... హాయ్ నిన్న నేను శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూశాను. ఈమద్య కాలంలో నేను చూసిన సినిమాల్లో ఈ సినిమా ఒక అద్బుతమైన సినిమా. ఇక నేను సాయి పల్లవికి బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అభిమానిని. ఆమె ఒక అద్బుతమైన అందగత్తె. ఆమె అందంగా ఉండటం మాత్రమే కాకుండా చాలా సహజంగా ఉంటుంది. ఆమె అద్బుతమైన డాన్సర్. నాని కూడా సినిమాలో అద్బుతంగా నటించాడంటూ చెప్పుకొచ్చింది.

మధుబాల వ్యాఖ్యలు సినిమా స్థాయి ని పెంచడం మాత్రమే కాకుండా సాయి పల్లవికి కెరీర్ బెస్ట్ ప్రశంసగా నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. సాయి పల్లవి ఆ వ్యాఖ్యలకు నూటికి రెండు వందల శాతం అర్హురాలు అనడంలో సందేహం లేదు. ఒక అద్బుతమైన యాక్టింగ్ యూనివర్శిటీ ఆమె అంటూ అభిమానులు అంటూ ఉంటారు. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా అద్బుతమైన అందగత్తె కూడా.. ఇక ఆమె డాన్స్ తో ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క స్టార్ హీరోయిన్ కూడా మ్యాచ్ అవ్వలేరు. డాక్టర్ అయిన సాయి పల్లవి బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ పలు సందర్బాల్లో నిరూపించుకుంది. ఆమె చాలా సున్నితమైన మనసు మరియు ఆమె లోతైన ఆలోచించే మనస్థత్వం వల్లే ఇంత మంచి సినిమాలను మంచి పాత్రలను ఆమె చేస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.