Begin typing your search above and press return to search.

మెగా రీమేక్ లో ఎలాంటి మార్పులు చేశారంటే..?

By:  Tupaki Desk   |   23 Jan 2021 10:39 AM GMT
మెగా రీమేక్ లో ఎలాంటి మార్పులు చేశారంటే..?
X
మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ మూవీ 'లూసిఫర్' రీమేక్ లో నటించనున్న సంగ‌తి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై ఆర్.బి చౌదరి - ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 'తని వరువన్' ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లో 153వ చిత్రంగా రానున్న 'లూసిఫర్' రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుంది. అయితే మెగా రీమేక్ ని తమిళ దర్శకుడు మోహన్ రాజా చేతిలో పెట్టడానికి ప్రధాన కారణం స్క్రిప్ట్ లో ఆయన చేసిన మార్పులే అని తెలుస్తోంది.

చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే సమయంలోనే మోహన్ రాజా తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో చేసిన మార్పులు చేర్పులు నచ్చాయని.. స్క్రిప్ట్ నేరేట్ చేసిన విధానం కూడా నచ్చడంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రొడ్యూసర్స్ సైతం ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా అద్భుతంగా సిద్ధం చేసారని వెల్లడించారు. అయితే ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదని తెలుస్తోంది. మలయాళ 'లూసిఫర్' మెయిన్ పాయింట్ ని తీసుకుని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా దర్శకుడు మార్చినట్లు తెలుస్తోంది. దీని కోసం మోహన్ రాజా ఆల్రెడీ తాను రెడీ చేరుకున్న స్క్రిప్ట్ ని ఇందులో జత చేసాడట. ఇప్పటికే పలు రీమేక్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేసి 'రీమేక్ రాజా' అనిపించుకున్న మోహన్ రాజా.. మరోసారి హిట్ సినిమా తీస్తాడని మెగా అభిమానులు నమ్ముతున్నారు. మరి ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.