ఈ ప్రశ్నలకు బదులేది మహర్షి ?

Tue May 21 2019 10:07:50 GMT+0530 (IST)

What Is The Answer To These Questions Maharshi

ఒక సూపర్ స్టార్ గా తన కొత్త సినిమా కోసం ఎంత ప్రమోషన్ చేయాలో అంత కన్నా ఎక్కువే చేసి మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ వెళ్ళిపోయాడు. ఇకపై మహర్షి ప్రయాణం సోలోగా సాగాల్సిందే. హీరో లేకుండా ఎంత పబ్లిసిటీ చేసినా అది జనంలో రిజిస్టర్ కాదు కాబట్టి ఇక యూనిట్ కూడా సైలెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మహర్షి వసూళ్ల పరంగా మహేష్ కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందా లేదా అనేది ఇంకా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది.తను పదే పదే వారంలో దాటేసింది అని చెబుతున్నప్పటికీ వాస్తవంగా లెక్కలు దానికి భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ సీడెడ్ లాంటి ఏరియాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడ నష్టాలు తప్పవని దాదాపు తేలిపోయినట్టే. సరే ఇదలా ఉంచితే శ్రీమంతుడు టైంలో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ రెండు మూడు ఊళ్ళకు అమలు పరిచి నిజం చేసి చూపించిన మహేష్ మహర్షి గురించి మాత్రం అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు

రైతు సంక్షేమ నిధికి ఏదైనా ధన సహాయం చేయడం కానీ లేదా రైతుల ప్రగతి కోసం ఏదైనా కార్యక్రమం చేపట్టడం కానీ ఇప్పటిదాకా చేయలేదు. వీకెండ్ ఫార్మింగ్ పేరుతో అభిమానులు పంపించిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం మినహా అంతకు మించి చేసినట్టు లేదు. మొదటి వారం టికెట్ ధరలు అంతేసి రేంజ్ లో పెంచుకుని అమ్మడం మీద విమర్శలు వచ్చినా దాని గురించి ఎవరూ ప్రస్తావించకపోవడం కొంత మేర అసంతృప్తిని రాజేస్తోంది.

పోనీ అంత బ్లాక్ బస్టర్ అయినప్పుడు వచ్చిన లాభాల్లో ఎంతో కొంత రైతుల సహాయార్థం ఏదైనా మంచి పనికి ఉపయోగించి ఉంటే ఇంకా స్ఫూర్తిగా ఉండేదేమోనన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదైతేనేం మొత్తానికి మహర్షి హడావిడి ఓ కొలిక్కి వచ్చినట్టే. పదే పదే ఎపిక్ ఎపిక్ అని చెప్పుకున్న మహర్షి టీమ్ మాటల్లో నిజానిజాలు ఇంకో రెండు వారాల్లో పూర్తి క్లారిటీ తెచ్చేస్తాయి. చూద్దాం