ప్రొఫైల్ నేమ్ మార్చేసి భర్తను 'అన్ ఫాలో' చేసిన మెగా డాటర్..!

Thu Jan 20 2022 20:00:02 GMT+0530 (IST)

What Is Going On With Sreeja Kalyan Dhev

గత కొన్ని రోజులుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆమె భర కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ లో భర్త కళ్యాణ్ దేవ్ పేరును తొలగించడం చర్చనీయాంశంగా మారింది. 'శ్రీజ కళ్యాణ్' అనే ప్రొఫైల్ నేమ్ లో 'కళ్యాణ్' ను తొలగించడమే కాదు.. తన తండ్రి ఇంటి పేరు 'కొణిదెల' ను జత చేసి 'శ్రీజ కొణిదెల' గా మార్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తన భర్తను 'అన్ ఫాలో' చేయడం హాట్ టాపిక్ అయింది.ఇన్స్టాగ్రామ్ లో చాలా కాలంగా యాక్టీవ్ గా ఉంటున్న శ్రీజ.. తన భర్త కళ్యాణ్ దేవ్ ని తప్ప కుటుంబ సభ్యులందరినీ ఫాలో అవుతోంది. చిరంజీవి - రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - ఆమె సోదరి మరియు ఇతర బంధువులను మెగా డాటర్ అనుసరిస్తోంది. కళ్యాణ్ ను మాత్రమే అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కళ్యాణ్ దేవ్ మాత్రం శ్రీజతో సహా మిగతా మెగా ఫ్యామిలీ సభ్యులందరిని ఫాలో అవుతుండటం గమనార్హం.

2016లో కళ్యాణ్ దేవ్ తో శ్రీజ రెండో వివాహం జరిగింది. వీరికి నవిష్క అనే పాప కూడా ఉంది. అయితే గత కొన్ని నెలల నుంచి వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో శ్రీజ - కళ్యాణ్ జంట విడిపోయినట్లు ప్రచారం జరిగింది. దీనికి తోడు ఇటీవల జరిగిన మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కళ్యాణ్ దేవ్ కనిపించక పోవడం.. మెగా అల్లుడు అనే బ్రాండ్ తో హీరోగా వచ్చిన అతని సినిమాని ప్రమోట్ చేయకపోవడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చింది.

శ్రీజ - కళ్యాణ్ దేవ్ జంట విడిపోతున్నారనే పుకార్లు హల్ చల్ చేస్తున్నప్పటికీ.. ఇంతవరకు వీరిద్దరి దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే ఈ పుకార్లను ఖండించలేదు. మరి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.