హాట్ టాపిక్: ఇస్మార్ట్ పళ్లు వెరీ డల్లు!

Tue Feb 25 2020 08:00:01 GMT+0530 (IST)

What Happened To Charmee Kaur Teeth

సీనియర్ హీరోయిన్ ఛార్మిని తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనే లేదు. దాదాపు 50 కి పైగా సినిమాల్లో నటించిన ఛార్మి ఖాతాలో ఎన్నో హిట్లు ఉన్నాయి.. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది. అయితే ఈమధ్య మాత్రం నటనకు దూరంగా ఉంటూ పూరి కనెక్ట్స్ బ్యానర్లో నిర్మాణ బాధ్యతలు చూస్తోంది. ఒకవైపు పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్'.. మరోవైపు విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాలతో ఛార్మీ బిజీగా ఉంది.అయితే నిర్మాతగా ఎంత బిజీగా ఉన్నప్పటికే సీనియర్ హీరోయిన్ గా ఛార్మికి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. వారు తమ అభిమాన నటి గ్లామర్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు. ఎందుకో తెలియదు కానీ చాలామంది ఛార్మి పళ్ల పై బెంగపెట్టుకున్నారు... టీవీ ప్రకటనల్లో చూపించినట్టుగా క్లోజప్.. పెప్సోడెంట్.. డాబర్.. హిమాలయా లాంటివి వాడడం లేదేమో కానీ ఛార్మీ టీత్ లో మునుపటి గ్లో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పలువరస కలర్ మారిందని కొందరు అంటుంటే.. అవి ఒరిజినల్ పళ్లలా కాకుండా అర్టిఫిషియల్ గా కనిపిస్తున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.

సాధారణ జనాల పళ్లను ఎవరూ పట్టించుకోరు. వంకరటింకరగా ఉన్నా.. గారపట్టినా.. ఊడిపోయి మధ్యలో గ్యాప్ ఉన్నా ఎవరికీ పట్టదు. కానీ హీరోయిన్ల సంగతి అలా ఉండదు కదా? మరి ఛార్మి తన పళ్ల విషయంలో జాగ్రత్త తీసుకుని ఈ కామెంట్లకు సమాధానం చెప్తుందో లేదో వేచి చూడాలి.